విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నంకు ఆదిలో హంసపాదు: 300 బ్యానర్ల తొలగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chinnam Ramakotaiah - Paladugu Venkat Rao
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్‌కు గురై, కాంగ్రెసులో చేరేందుకు సిద్ధమౌతున్న నూజివీడు శాసనసభ్యుడు చిన్నం రామకోటయ్యకు ఆ పార్టీ నుండి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మూడు రోజుల ఇందిర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం చిన్నం నియోజకవర్గమైన నూజివీడుకు మధ్యాహ్నం వస్తున్నారు. ఈ సందర్భంగా ఇటు చిన్నం అటు శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు ముఖ్యమంత్రికి భారీగా స్వాగత బ్యానర్లు కట్టారు.

మరోవైపు కిరణ్ కార్యక్రమంలో తాను సూచించిన కార్యక్రమాన్ని చేర్చకపోవడంపై పాలడుగు అధికారులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నం సూచించిన కార్యక్రమం మాత్రం ఉందట. దీంతో ఇది కాస్త పాలడుగు, చిన్నం వర్గాల మధ్య గొడవకు దారి తీసినట్లుగా తెలుస్తోంది. మంత్రి పార్థసారథి అధికారులతో మాట్లాడి పాలడుగు కార్యక్రమాన్ని చేర్చారు. కాంగ్రెసు కార్యకర్తలు తమ అసంతృప్తిని చిన్నం బ్యానర్లపై చూపించారట. బ్యానర్లు తొలగించే ప్రయత్నాలు చేశారు.

దీంతో మనస్తాపం చెందిన చిన్నం రామకోటయ్య తన వారిచే స్వయంగా తాను ఏర్పాటు చేయించిన మూడు వందల బ్యానర్లను తొలగింప చేశారు. ఈ సందర్భంగా చిన్నం వర్గం, కాంగ్రెసు కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. కిరణ్ తన నియోజకవర్గానికి వస్తున్నందున కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేను కాకపోయినప్పటికీ బ్యానర్లు ఏర్పాటు చేశానని, దీనిని కాంగ్రెసు నేతలు అర్థం చేసుకోకపోవడం బాధాకరమని చిన్నం అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ పైన ఆర్ అండ్ బి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా సిఎం మధ్యాహ్నం నియోజకవర్గంలోని ట్రిపుల్ ఐటి విద్యార్థులతో మాట్లాడతారు. జయంతి గ్రామంలో ఇందిర బాటను ప్రారంభిస్తారు. వేలూరు గ్రామంలో అనాథాశ్రమానికి శంకుస్థాపన చేస్తారు.

English summary
Congress party leaders removed banners of MLA Chinnam Ramakotaiah in Nuziveedu constituency. MLC Paladugu Venkat Rao lashed out at officers for not include his program in CM Kiran Kumar Reddy's Indira Bata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X