విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోట్లు కావాలంటారు: కిరణ్, గొర్రెల కాపరిలా.. లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
విజయవాడ: అభివృద్ధి పనుల కోసం ప్రజలు కోట్ల రూపాయలు కావాలంటారు.. కానీ ఒక్క రూపాయి పన్ను వేస్తే మాత్రం గొడవ చేస్తారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. కృష్ణా జిల్లాలో మూడు రోజుల ఇందిర బాట కార్యక్రమంలో భాగంగా కిరణ్ నూజివీడు నియోజకవర్గం జయంతి గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివడద్ధి కోసం కోట్లు కావాలనే ప్రజలు పన్నులు వేస్తే గొడవ చేయడం సరికాదన్నారు.

పన్నుల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. గొర్రెల కాపర్లకు రూ.100 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాల వల్ల గొర్రెలు చనిపోతే రూ.వెయ్యి నష్ట పరిహారం ఇస్తున్నామన్నారు. విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున స్కాలర్ షిప్పులు ఇస్తోందని, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల కార్యకర్తలకు, ప్రజలకు అభివృద్ధిని పంచుతున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా జయంతి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆయన శంకుస్థాపనం చేసారు. కాగా తెలంగాణ కవాతును వాయిదా వేసేలో చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానా రెడ్డిలకు సూచించిన విషయం తెలిసిందే. ఇందిర బాటలో ఉన్న ఆయన వారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి గణేష్ నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో జెఏసి నేతలతో చర్చించి వాయిదా వేయించేలా చూడాలని కోరారు.

ఇదే కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి మాట్లాడుతూ... క్రీస్తు ఒకప్పుడు గొర్రెల కాపరి అని, గొర్రెలను క్రమశిక్షణలో పెట్టి సక్రమంగా నడిపించారని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రాన్ని సక్రమంగా నడిపిస్తారన్నారు.

English summary
CM Kiran Kumar Reddy said on Wednesday in his Krishna district Indira Bata that government is earing money from taxes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X