అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అరెస్ట్: రైతుల హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
రాజమండ్రి/అనంతపురం: తూర్పు గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అలదెండి పార్వతి అరెస్టయ్యారు. వెంకటేశ్వర నగర్‌లోని భూకబ్జాకు సంబంధించిన కేసులో పోలీసులు ఆమెను బుధవారం ఉదయం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టారు. మెజిస్ట్రీట్ ఆమెకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. కాగా ఇదే కేసుకు సంబంధించి మంగళవారం ఇద్దరు అరెస్టయ్యారు.

సబ్ జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం

జిల్లాలోని పెద్దాపురం సబ్ జైలులో ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్యను వేధిస్తున్న కేసులో శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఇతను ఈ రోజు ఉదయం బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన జైలు సిబ్బంది అతడిని వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించింది. ఖైదీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.

లారీ-బైక్ ఢీ.. ఒకరి మృతి
జిల్లాలోని జగిత్యాల మండలంలో దారుణం జరిగింది. కండ్లపల్లిలో మంత్రాల నెపంతో కోలార్ జమున అనే వృద్ధురాలిని చందర్ అనే వ్యక్తి కర్రలతో తలపై మోది హత్య చేశాడు. విషయం తెలిసిన పోలీసలు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చందర్ పరారీలో ఉన్నాడు.

వృద్ధురాలి హత్య
జిల్లాలోని జగిత్యాల మండలంలో దారుణం జరిగింది. కండ్లపల్లిలో మంత్రాల నెపంతో కోలార్ జమున అనే వృద్ధురాలిని చందర్ అనే వ్యక్తి కర్రలతో తలపై మోది హత్య చేశాడు. విషయం తెలిసిన పోలీసలు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చందర్ పరారీలో ఉన్నాడు.

ఇద్దరు రైతుల హత్య

అనంతపురం జిల్లాలోని బొమ్మనహళ్ మండలం కురువల్లి గ్రామంలో ఇద్దరు రైతులు హత్య గావింప పడ్డారు. దుండగులు నలుగురిపై దాడి చేశారు. ఇద్దరు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. వారికి తీవ్రంగా గాయాలు కావడంతో బళ్లారి ఆసుపత్రికి తరలించారు.

English summary
YSR Congress party leader Aladenti Parvathi was arrested by East Godavari police and sentenced for 14 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X