• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రేమలో బిలావల్, హీనా: భర్తకు విడాకులిచ్చి కొత్త లైఫ్

By Srinivas
|

Hina Rabbani Khar & Bilawal Bhutto
ఇస్లామాబాద్: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టోల మధ్య ప్రేమాయణం నడుస్తోందని బంగ్లాదేశ్‌కు చెందిన వీక్లీ బ్లిట్జ్ అనే టాబ్లాయిడ్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. ఆ కథనం ప్రకారం.. పెళ్లి చేసుకున్నాక పాకిస్థాన్ వదిలి స్విట్జర్లాండ్‌లో స్థిరపడాలని ఈ జంట పథకం వేసిందట. కానీ, వీరి ప్రేమకథ జర్దారీకి ఏమాత్రం నచ్చలేదట.

తన కొడుకు కన్నా ఆమె వయసులో పదకొండేళ్లు పెద్దది కావడం.. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండటం.. ఇవీ జర్దారీ నిరాకరణకు కారణంగా పేర్కొంది. బిలావల్‌ను భావి పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆ దేశంలో చాలామంది భావిస్తారు. కానీ, ఈ పెళ్లితో బిలావల్ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్దారీ బెంగపెట్టుకున్నారని వివరించింది.

ప్రముఖ వ్యాపారవేత్త, కోటీశ్వరుడు అయిన తన భర్త ఫిరోజ్ గుల్జార్ నుంచి విడాకులు తీసుకోవాలని, కూతుళ్లను భర్త దగ్గరే వదిలేసి.. బిలావల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని హీనా రబ్బానీ భావిస్తున్నట్టు పేర్కొంది. ఒకసారి వీరిద్దరూ పాకిస్తాన్ అధ్యక్ష భవనంలో అత్యంత సన్నిహితంగా ఉండగా జర్దారీకి దొరికిపోయారని కూడా రాసింది. బిలావల్ పుట్టినరోజు సందర్భంగా రబ్బానీ ఒక గ్రీటింగ్ కార్డు పంపిందని.. అందులో మన బంధం శాశ్వతమైనదని, మనం త్వరలోనే మనకు మనంగా ఉంటామని అని ఆమె చేతి రాతతో రాసి ఉందని తెలిపింది.

జర్దారీ ఎంత ప్రతిఘటిస్తున్నా హీనా రబ్బానీని పెళ్లాడాలని బిలావల్ కృతనిశ్చయంతో ఉన్నాడని.. ఇందుకోసం పిపిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడడం లేదని రాసింది. హీనా రబ్బానీ, ఆమె కూతుళ్లతో కలిసి స్విట్జర్లాండ్‌లో స్థిరపడతానని ఒకసారి, విడాకుల అనంతరం రబ్బానీ తన అమ్మాయిలిద్దరినీ భర్త దగ్గరే వదిలేస్తుందని మరోసారి జర్దారీకి బిలావల్ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. వీరిద్దరి బంధాన్ని విడగొట్టేందుకు.. జర్దారీ ప్రభుత్వ యంత్రాంగాన్ని రబ్బానీ భర్త వ్యాపార ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించినా ఫలితం లేకపోయిందట.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A sensational news over Hina Rabbani Khar and Bilawal Bhutto's love affair rocked Pakistan. A Bangladeshi tabloid recently has claimed that the duo are in love and planning to leave Pakistan soon after their marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more