హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై మరో ఎమ్మెల్యే: 'జూ ఎన్టీఆర్‌ను అణగదొక్కారు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తంబళ్లపల్లి శాసనసభ్యుడు ప్రవీణ్ రెడ్డి నిప్పులు చెరిగిన వెంటనే మరో ఎమ్మెల్యే కూడా గురువారం మండిపడ్డారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్లనే తెలుగుదేశం పార్టీ అథోగతి పాలైందని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రానికి ఇచ్చిన లేఖను బాబు వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు.

లేదంటే తాను పార్టీకి, పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. బాబు వల్ల పార్టీ భ్రష్టు పట్టిపోయిందన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమిస్తానని అన్నారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి ప్రజా బలం లేదని తేలిందని అమర్నాథ్ రెడ్డి దుయ్యబట్టారు. బాబు లేఖ ఉపసంహరించుకోకుంటే సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ తీవ్రంగా నష్ట పోతుందన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కితాబు ఇచ్చారు. జగన్ అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదని, మాట్లాడాలంటే తామే మాట్లాడాలన్నారు. జగన్ ఓ పోరాట యోధుడు అన్నారు. తాను కార్యకర్తలతో మాట్లాడాకే భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశ్య పూర్వకంగా అణగదొక్కారని ఆరోపించారు. చంద్రబాబుకు, తమకు మధ్య జనరేషన్ గ్యాప్ ఉందన్నారు. కాగా తెలంగాణపై ప్రధానమంత్రికి చంద్రబాబు లేఖ ఇవ్వడాన్ని నిరసిస్తూ ప్రవీణ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

English summary
TDP Tamballapalli MLA Praveen Reddy has lashed out at party chief Nara Chandrababu Naidu for his letter to PM Manmohan Singh on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X