చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేఖ చిచ్చు: బాబుపై టిడిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
చిత్తూరు: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖపై ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. టిడిపి తంబళ్లపల్లి శాసనసభ్యుడు ప్రవీణ్ రెడ్డి గురువారం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలంగా గతంలో రాసిన లేఖను తమ పార్టీ అధ్యక్షుడు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే టిడిపి పేరును తెలంగాణ దేశంగా పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మార్చ్ అంటే సీమాంధ్రులపై పరోక్షంగా సీమాంధ్రులపై దాడి జరిపుతున్నట్లే అన్నారు. అలాంటి మార్చ్‌కి తమ సహచర తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మద్దతివ్వడం దారుణమన్నారు. తెలంగాణపై పార్టీ ఇచ్చిన లేఖను నిరసిస్తూ తాను ఆయన నిర్వహించబోయే పాదయాత్రలో తాను నిరసన వ్యక్తం చేస్తానని చెప్పారు. లేఖను ఉపసంహరించుకోకుంటే పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు.

రాయలసీమవాసి అయి ఉండి బాబు ఇలా చేయడం సరికాదన్నారు. టిడిపి అంటే తెలంగాణ దేశం పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. 2009 తర్వాత పార్టీ అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. నాటి నుండి తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని తప్పుడుగానే ఉన్నాయని మండిపడ్డారు. గతంలో తీసుకున్న నిర్ణయాల నుండి మొదలు తెలంగాణ నిర్ణయం వరకు అన్ని తప్పిదాలే అన్నారు. బాబు నిర్ణయాల వల్లనే టిడిపి ఇలా తయారయిందని ఆరోపించారు.

పాదయాత్ర లోగా లేఖను ఉపసంహరించుకోకుంటే తన సహకారం ఉండదని, పైగా నిరసన తెలుపుతానన్నారు. తనకు పార్టీని వీడాలని లేదని, అయితే తనకు పార్టీ భవిష్యత్తు కంటే రాష్ట్ర భవిష్యత్తు ఇంకెంతో ముఖ్యమన్నారు. సీమాంధ్రలో దాదాపు అందరూ సమైక్యాంధ్ర కోరుకుంటున్నారని, తెలంగాణ ప్రాంతంలో కూడా దాదాపు సగం మంది అదే కోరుకుంటున్నారని చెప్పారు. బాబుపై తన సొంత జిల్లాలో వ్యతిరేకత ఉందని మండిపడ్డారు. ఆయన నిర్ణయాలు అన్నీ పార్టీకి నష్టమే అన్నారు.

English summary

 TDP Tamballapalli MLA Praveen Reddy has lashed out at party chief Nara Chandrababu Naidu for his letter to PM Manmohan Singh on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X