వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా గెలిస్తే బట్టలిప్పుతానన్న పాప్ స్టార్ మడోన్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Monday
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠాన్నీ ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామానే మళ్లీ అధిష్టిస్తే తాను తన ఒంటి పైన ఉన్న బట్టలను ఊడదీసి ఒక వేదికపై నగ్నంగా కనిపిస్తానని యాభై నాలుగేళ్ల అమెరికన్ పాప్ రారాణి మడోన్నా చెప్పారు. ఈమె సోమవారం రాత్రి వాషింగ్టన్‌లో సంగీత కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె ఒబామా రెండోసారి అధ్యక్షుడిగా అయితే తాను నగ్నంగా నిలబడతానని సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో ఒబామాను నల్లజాతి ముస్లింగా ఆమె అభివర్ణించారు. ఆయన విజయాన్ని తాను కోరుకుంటున్నానని చెప్పారు. స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఒబామా ఎంతగానో పోరాడారని కితాబు ఇచ్చారు.

ఆయనకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. తన వీపు వెనుక రాసి ఉన్న ఒబామా అనే అక్షరాలను ఆమె ప్రేక్షకులకు చూపించారు. తన వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో.. ఒబామా క్రైస్తవుడనే విషయం తనకు తెలుసని చెప్పారు. అయితే అమెరికాలో అత్యధిక శాతం మంది నమ్ముతున్న విషయాన్నే తాను చెప్పానని తెలిపారు. ఆ తర్వాత ఒబామాను ముస్లిం అన్నందుకు పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో మడోన్నా క్షమాపణలు కోరింది.

English summary

 The 54-year-old singer asked everyone in the audience of her Washington, DC performance Monday night to vote for President Obama because he is a "black Muslim."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X