• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిలావల్‌తో లవ్‌ఎఫైర్: ఫత్వా చిక్కు?, ఖండించిన హీనా

By Srinivas
|

Hina Rabbani Khar
ఇస్లామాబాద్/డాకా: పాకిస్తాన్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ తనయుడు, పిపిపి నేత బిలావల్ భుట్టోతో ప్రేమ వ్యవహారం నడుపుతోందనే వార్తలు పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌కు కొత్త కొత్త చిక్కులు తెచ్చి పెట్టేలా కనిపిస్తున్నాయి! హీనా, బిలావల్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని బంగ్లాదేశ్ వారపత్రిక బ్లిట్జ్ ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో ఇది వేడిని రగిల్చింది. తాజాగా బంగ్లాకు చెందిన డెయిలీ ఇత్తేఫక్ అనే దిన పత్రిక మరో బాంబు పేల్చింది.

హీనా, బిలావల్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ గ్రూపులు వారిద్దరికీ ఫత్వా జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. పాకిస్తాన్ చట్టాల ప్రకారం అక్రమంగా ప్రేమ వ్యవహారం నడిపితే శిక్షార్హమేనని రాసింది. వివాహేతర సంబంధం ప్రచారం నేపథ్యంలో హీనాను జర్దారీ విదేశాంగ బాధ్యతల నుండి తొలగించే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఆమెను మంత్రి పదవి నుండి తొలగించే అవకాశాలు మెండు అని రాసింది. హీనా రబ్బానీ ఖర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

మరోవైపు హీనా రబ్బానీ ఖర్ తనపై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. తనకు బిలావల్ భుట్టోకు మధ్య ఎలాంటి సంబంధం లేదని, అవన్నీ అవాస్తవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

కాగా హీనా రబ్బానీ ఖర్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టోల మధ్య ప్రేమాయణం నడుస్తోందని బంగ్లాదేశ్‌కు చెందిన వీక్లీ బ్లిట్జ్ అనే టాబ్లాయిడ్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కథనం ప్రకారం.. పెళ్లి చేసుకున్నాక పాకిస్థాన్ వదిలి స్విట్జర్లాండ్‌లో స్థిరపడాలని ఈ జంట పథకం వేసిందట. కానీ, వీరి ప్రేమకథ జర్దారీకి ఏమాత్రం నచ్చలేదట.

తన కొడుకు కన్నా ఆమె వయసులో పదకొండేళ్లు పెద్దది కావడం.. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండటం.. ఇవీ జర్దారీ నిరాకరణకు కారణంగా పేర్కొంది. బిలావల్‌ను భావి పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆ దేశంలో చాలామంది భావిస్తారు. కానీ, ఈ పెళ్లితో బిలావల్ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్దారీ బెంగపెట్టుకున్నారని వివరించింది.

ప్రముఖ వ్యాపారవేత్త, కోటీశ్వరుడు అయిన తన భర్త ఫిరోజ్ గుల్జార్ నుంచి విడాకులు తీసుకోవాలని, కూతుళ్లను భర్త దగ్గరే వదిలేసి.. బిలావల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని హీనా రబ్బానీ భావిస్తున్నట్టు పేర్కొంది. ఒకసారి వీరిద్దరూ పాకిస్తాన్ అధ్యక్ష భవనంలో అత్యంత సన్నిహితంగా ఉండగా జర్దారీకి దొరికిపోయారని కూడా రాసింది. బిలావల్ పుట్టినరోజు సందర్భంగా రబ్బానీ ఒక గ్రీటింగ్ కార్డు పంపిందని.. అందులో మన బంధం శాశ్వతమైనదని, మనం త్వరలోనే మనకు మనంగా ఉంటామని అని ఆమె చేతి రాతతో రాసి ఉందని తెలిపింది.

జర్దారీ ఎంత ప్రతిఘటిస్తున్నా హీనా రబ్బానీని పెళ్లాడాలని బిలావల్ కృతనిశ్చయంతో ఉన్నాడని.. ఇందుకోసం పిపిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడడం లేదని రాసింది. హీనా రబ్బానీ, ఆమె కూతుళ్లతో కలిసి స్విట్జర్లాండ్‌లో స్థిరపడతానని ఒకసారి, విడాకుల అనంతరం రబ్బానీ తన అమ్మాయిలిద్దరినీ భర్త దగ్గరే వదిలేస్తుందని మరోసారి జర్దారీకి బిలావల్ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. వీరిద్దరి బంధాన్ని విడగొట్టేందుకు.. జర్దారీ ప్రభుత్వ యంత్రాంగాన్ని రబ్బానీ భర్త వ్యాపార ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించినా ఫలితం లేకపోయిందట.

అయితే హీనా, బిలావల్ మధ్య ప్రేమాయమం వార్తలపై ఆమె భర్త ఫిరోజ్ గుల్జార్ తీవ్రంగా స్పందించారు. బిలావల్ భుట్టోతో హీనా ప్రేమాయణం వార్తలన్నీ కేవలం అప్రతిష్ఠ పాలు చేసేందుకే సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా రబ్బిష్ రూమర్స్ అన్నారు. ఆ ఆరోపణలన్నీ సోషల్ మీడియా పుట్టించిన వదంతులేనని, హీనాకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తాము హాయిగా జీవిస్తున్నామని చెప్పారు.

English summary
Not all seems to be well for Pakistan Foreign Minister Hina Rabbani Khar, who is allegedly in a love relationship with Pakistan People’s Party leader Bilawal Bhutto. On its front page, a Bangladeshi newspaper, The Daily Ittefaq, has reported that Islamist groups in Pakistan may now issue fatwa against Khar and Bilawal over their illicit romantic affair. Notably, illicit love affairs are punishable crime under the existing law of Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X