వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిలావల్ ప్రేమలో హీనా: రబ్బిష్.. ఖర్‌కు భర్త మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hina Rabbani Khar
ఇస్లామాబాద్: తన సతీమణి, విదేశాంగ శాఖ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌కు తనకు మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని హీనా భర్త ఫిరోజ్ గుల్జర్ తెలిపారు. హీనా, బిలావల్ మధ్య ప్రేమాయమం వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. బిలావల్ భుట్టోతో హీనా ప్రేమాయణం వార్తలన్నీ కేవలం అప్రతిష్ఠ పాలు చేసేందుకే సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా రబ్బిష్ రూమర్స్ అన్నారు. ఆ ఆరోపణలన్నీ సోషల్ మీడియా పుట్టించిన వదంతులేనని, హీనాకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, తాము హాయిగా జీవిస్తున్నామని చెప్పారు.

కాగా హీనా రబ్బానీ ఖర్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టోల మధ్య ప్రేమాయణం నడుస్తోందని బంగ్లాదేశ్‌కు చెందిన వీక్లీ బ్లిట్జ్ అనే టాబ్లాయిడ్ ప్రచురించిన కథనం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కథనం ప్రకారం.. పెళ్లి చేసుకున్నాక పాకిస్థాన్ వదిలి స్విట్జర్లాండ్‌లో స్థిరపడాలని ఈ జంట పథకం వేసిందట. కానీ, వీరి ప్రేమకథ జర్దారీకి ఏమాత్రం నచ్చలేదట.

తన కొడుకు కన్నా ఆమె వయసులో పదకొండేళ్లు పెద్దది కావడం.. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉండటం.. ఇవీ జర్దారీ నిరాకరణకు కారణంగా పేర్కొంది. బిలావల్‌ను భావి పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆ దేశంలో చాలామంది భావిస్తారు. కానీ, ఈ పెళ్లితో బిలావల్ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని జర్దారీ బెంగపెట్టుకున్నారని వివరించింది.

ప్రముఖ వ్యాపారవేత్త, కోటీశ్వరుడు అయిన తన భర్త ఫిరోజ్ గుల్జార్ నుంచి విడాకులు తీసుకోవాలని, కూతుళ్లను భర్త దగ్గరే వదిలేసి.. బిలావల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని హీనా రబ్బానీ భావిస్తున్నట్టు పేర్కొంది. ఒకసారి వీరిద్దరూ పాకిస్తాన్ అధ్యక్ష భవనంలో అత్యంత సన్నిహితంగా ఉండగా జర్దారీకి దొరికిపోయారని కూడా రాసింది. బిలావల్ పుట్టినరోజు సందర్భంగా రబ్బానీ ఒక గ్రీటింగ్ కార్డు పంపిందని.. అందులో మన బంధం శాశ్వతమైనదని, మనం త్వరలోనే మనకు మనంగా ఉంటామని అని ఆమె చేతి రాతతో రాసి ఉందని తెలిపింది.

జర్దారీ ఎంత ప్రతిఘటిస్తున్నా హీనా రబ్బానీని పెళ్లాడాలని బిలావల్ కృతనిశ్చయంతో ఉన్నాడని.. ఇందుకోసం పిపిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడడం లేదని రాసింది. హీనా రబ్బానీ, ఆమె కూతుళ్లతో కలిసి స్విట్జర్లాండ్‌లో స్థిరపడతానని ఒకసారి, విడాకుల అనంతరం రబ్బానీ తన అమ్మాయిలిద్దరినీ భర్త దగ్గరే వదిలేస్తుందని మరోసారి జర్దారీకి బిలావల్ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. వీరిద్దరి బంధాన్ని విడగొట్టేందుకు.. జర్దారీ ప్రభుత్వ యంత్రాంగాన్ని రబ్బానీ భర్త వ్యాపార ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించినా ఫలితం లేకపోయిందట.

English summary

 Pakistan foreign minister Hina Rabbani Khar's husband has rubbished rumours about his 34-year-old wife's alleged affair with ruling Pakistan Peoples Party chairman Bilawal Bhutto Zardari (24).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X