హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుమతి ఇవ్వడం లేదని రాసివ్వండి: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు కొంత మేరకు మాత్రమే అనుమతి ఇవ్వడంపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మార్చ్‌కు నెక్లెస్ రోడ్డు మొత్తం కాకుండా కొంత మేరకే పోలీసులు అనుమతి ఇచ్చారు. దీనిపై కోదండరామ్ శనివారం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మను కలిశారు. పూర్తి స్థాయిలో తమకు అనుమతి కావాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. లేదంటే మార్చ్‌కు అనుమతి ఇవ్వడం లేదని రాసివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో అనురాగ్ శర్మ ఓ గంట సమయం అడిగారు.

తెలంగాణ మార్చ్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ మరోవైపు తెలంగాణ నేతలు, కార్యకర్తలను అరెస్టులు చేయడం సరికాదని రాజకీయ కోదండరాం అన్నారు. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదని ఆయన అన్నారు. తాము కవాతును శాంతియుతంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ ఉదయమే అరెస్టుల విషయంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జానారెడ్డిలను కలుసుకుని మాట్లాడామని, కవాతుకు వస్తున్న వారిని అపవద్దని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. తక్షణమే అరెస్టులు నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ మార్చ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వస్తున్న తెలంగాణ వాదులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన తర్వాత కూడా అరెస్టులు చేయడం సబబు కాదని అన్నారు.

అరెస్టులను ఆపకపోతే జరగబోయే పరిణామాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధ్యత వహించాలని నారాయణ హెచ్చరించారు. తెలంగాణవ్యాప్తంగా అరెస్టు చేసిన సీపీఐ నేతలను, తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి అరెస్టులు కొనసాగించడం ప్రభుత్వ కుటిల నీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. అరెస్టులపై మరోసారి హోం మంత్రిని కలుస్తామని ఆయన తెలిపారు.

English summary
Telangana JAC chairman Kodandaram demanded full fledged permission on Necklace road of Hussain sagar. Police sanctioned limited permission. Kodandaram objected for that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X