వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాంతీయవాదాన్ని గౌరవిస్తా: కేంద్ర మంత్రి పల్లంరాజు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pallam Raju
కాకినాడ : ఎవరి ప్రాంతీయవాదం వారిదని, తెలంగాణ రాష్ట్రం కావాలనేది అక్కడి ప్రజల సెంటిమెంటని, ప్రాంతీయవాదాన్ని గౌరవిస్తానని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎంఎం పళ్లంరాజు చెప్పారు. అలాగే రాష్ట్రం విడిపోకూడదనేది రాయలసీమ, కోస్తా ప్రజల ఆకాంక్ష అని, ఓ కేంద్ర మంత్రిగా అన్ని ప్రాంతాల వాదనను అర్థం చేసుకోగలగాలని ఆయన అన్నారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతనిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఓ పెద్ద అంశమని, ఇది కేంద్ర పరిధిలోనిదని, మూడు ప్రాంతాల మనోభావాలు కూలంకషంగా తెలుసుకుని తర్వాత నిర్ణయం తీసుకోడానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిందని ఆయన అన్నారు.

తెలంగాణ మార్చ్ జరుపుకోవడం వారి అభీష్టమని, జరుపుకోవాలా.. వద్దా .. అనే విషయంలో ప్రత్యేకించి స్పందించడానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ లోక్‌సభ నియోజవర్గంలో గత ఆరున్నరేళ్లలో ఎంపీ లాడ్స్‌తో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రగతిని వివరించారు. రాష్ట్రంలో విశాఖపట్టణం, హైదరాబాద్‌ల్లో యుద్ధ సామగ్రి ఎక్కువగా తయారవుతోందన్నారు.

రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ఇప్పటి మంత్రి ఆంటోనీ హయాం వరకూ రూ.21 వేల కోట్లతో వివిధ రకాల ఆయుధాలు తయారయ్యాయన్నారు. ఇంకా రూ.40 వేల కోట్ల విలువైన యుద్ధ సామగ్రి తయారీకి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

English summary
Union minister Pallamraju said that he will honour regional sentiments. He told that Telangana is a big use and it is under the perview of centra government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X