హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారిని అరెస్టు చేయలేదేం: సిబిఐపై కోర్టులో మోపిదేవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana
హైదరాబాద్: వాన్‌పిక్ కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానంద రెడ్డి బెయిల్ పిటిషన్‌ల పైన సోమవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపు వాదనలు పూర్తయిన అనంతరం కోర్టు వారి బెయిల్ పైన తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సిబిఐ తరఫు న్యాయవాది వాదిస్తూ... వాన్‌పిక్ విషయంలో అందరూ కలిసే కుట్ర పన్నారని ఆరోపించారు.

సిబిఐ ఆరోపణలకు మోపిదేవి తరఫు న్యాయవాది కౌంటర్ వేశారు. సిబిఐ ఒక్కొక్కరి విషయంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో మిగతా నిందితులను సిబిఐ ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. మిగతా వారు బయట ఉంటే సాక్ష్యాలు తారుమారు కావా అని ప్రశ్నించారు. మిగతా నిందితులను కూడా అరెస్టు చేయాలని కోర్టుకు సూచించారు. సిబిఐ తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు.

శ్రీలక్ష్మి బెయిల్ విచారణ ఎల్లుండి

కర్నాటక మాజీమంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్ పైన విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు బిపి ఆచార్యకు బెయిల్ ఇవ్వవద్దంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. విచారణను కోర్టు 5వ తేదికి వాయిదా వేసింది.

English summary
Former Minister Mopidevi Venkataramana blamed CBI in court while hearings on his bail petition that Why CBI was not arrested other accused in VANPIC case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X