• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిలావల్‌తో లవ్ అఫైర్: హీనా ఆత్మహత్యాయత్నం?

By Pratap
|

Hina Rabbani Khar
ఇస్లామాబాద్: బిలావల్ భుట్టోతో ప్రేమాయణం నడిపినట్లు పెద్ద యెత్తున ప్రచారం కావడంతో మనస్తాపానికి గురై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుపుతూ బంగ్లాదేశ్‌కు చెందిన ఓ టాబ్లాయిడ్ వార్తాకథనాన్ని ప్రచురించింది. హీనా రబ్బానీకి, పాలక పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టోకు మధ్య ప్రేమాయణనం నడుస్తున్నట్లు తొలిసారి బయటపెట్టింది వీక్లీ బ్లిడ్జ్.

హీనా రబ్బానీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కూడా ఆ పత్రికే రాసింది. నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించినట్లు ఆ పత్రిక రాసింది. తన లక్షాధికారి భర్త ఫిరోజ్ గుల్జార్ తన వ్యాపార భాగస్వామితో వైవాహికేతర సంబంధం నెరుపుతున్నట్లు తెలియడంతో హీనా రబ్బానీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లు ఆ పత్రిక రాసింది.

ఆ పత్రికా కథనం ప్రకారం - హీనాకు, గుల్జార్‌కు మధ్య అపనమ్మకం పెరుగుతూ వచ్చింది. దీంతో తన కన్నా 11 ఏళ్లు చిన్నవాడైన బిలావల్‌తో హీనా ప్రేమలో పడింది. తన భార్యకు, బిలావల్‌కు మధ్య ప్రేమాయణం నడుపుతున్నట్లు వచ్చిన వార్తలను హీనా భర్త గుల్జార్ ఖండించారు. పాకిస్తాన్ రాజకీయ విభేదాల కారణంగానే తన భార్యపై కుట్ర జరిగి, అటువంటి వార్తలు వచ్చాయని ఆయన అన్నారు.

హీనాకు వ్యతిరేకంగా ఐఎస్ఐ కుట్ర చేసిందని పిపిపి నాయకుడొకరు అన్నారు. అదృశ్యమైనవారిపై దర్యాప్తు చేయడానికి ఐక్యరాజ్యసమితికి వెసులుబాటు కల్పించడం వల్ల హీనాపై ఐఎస్ఎ కుట్ర చేసిందని అంటున్నారు. ఐఎస్ఐపై విమర్శలను పాకిస్తాన్ సైన్యం ఖండించింది. ఆ ఆరోపణలు నిరాధారమైవని వ్యాఖ్యానించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 Pakistan Foreign Minister Hina Rabbani Khar, who currently has hogged the limelight over her alleged romantic affair with Bilawal Bhutto, had tried to commit suicide, reported Bangladeshi tabloid The Weekly Blitz.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more