హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పురాణాల్లోనే: జీవవైవిధ్య మీట్‌లో గవర్నర్ శాంతిమంత్రం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narasimhan
హైదరాబాద్: గాలి, నేల, ఆకాశం, నీరు, సృష్టికర్త, చెట్లు అన్నింటికి శాంతి కలుగును కాగ అని ఎప్పుడో పురాణాల్లోనే ప్రశాంత జీవనం గురించి చెప్పారని గవర్నర్ నరసింహన్ జీవ వైవిధ్య సదస్సులో సోమవారం అన్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు హైదరాబాదులో సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. ఈ సదస్సును కేంద్రమంత్రి జయంతి నటరాజన్ ప్రారంభించారు. ఆమె ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం నరసింహన్ మాట్లాడారు.

ఓం బ్రహ్మ శాంతి.. సర్వగుమ్ శాంతి అంటూ ఆయన తన ప్రసంగంలో చదివి పురాణాల్లోనే ప్రకృతిని రక్షించుకోవాలని చెప్పారన్నారు. జీవ వైవిధ్య సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. మాన మనుగడకు ప్రమాదకరంగా పరిణమించిన అంశాలపై ఈ సదస్సు పరిష్కారం చూపుతుందని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని నరసింహన్ చెప్పారు. పర్యావరణానికి అధిక క్రిమిసంహారక మందులు వాడకం కూడా హానికరంగా మారుతున్నాయన్నారు.

సర్వజీవాలకు, సృష్టి మూలాలకు శాంతి అవసరమనేది ఆర్యోక్తి అని ఆయన అన్నారు. మానవ చరిత్రలో పర్యావరణానికి చాలా ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. అనారోగ్యాలు, ఆకలి సమస్యలను అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. భూగర్భ జల వనరులు అడుగంటిపోవడం, సాగు భూములు తగ్గుదలపై సదస్సులో చర్చించి పలు సూచనలు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

English summary
Governor ESL Narasimhan was attended at the inaugaral session of Biodiversity Convention, Hyderabad along with Union minister of Environment and forest Jayanthi Natarajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X