వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా సిఎం: కిరణ్‌పై విహెచ్, రిజైన్లతోరాదు.. డికె అరుణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao-DK Aruna
న్యూఢిల్లీ: రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాన్ని విభజించలేమన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ తన వ్యాఖ్యలతో ఆంధ్రాకే సిఎంను అని నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణవాదులను సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని విహెచ్ సూచించారు.

విజయవాడ, గుంటూరు, ఏలూరు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, కావూరి సాంబశివ రావులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు మేనిఫెస్టోలో తెలంగాణ అంశం పెట్టినప్పుడు సీమాంధ్ర నేతలు ఎందుకు ప్రశ్నించలేదని విహెచ్ అడిగారు.

తెలంగాణ కవాతు ప్రశాంతంగా జరిగిందని విహెచ్ కితాబిచ్చారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కవాతు ప్రశాంతంగా జరిగిందని చెబుతుంటే రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాత్రం తెలంగాణవాదులపై కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు.

సిఎంపై సభా హక్కుల నోటీసు యోచనలో టిఎంపీలు

తెలంగాణ కవాతు విజయవంతం కావొద్దని ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా రైళ్లు, బస్సులను రద్దు చేయించినా సఫలమైందని ఎంపీలు మధుయాష్కీ, మందా జగన్నాథం అన్నారు. సొంత పార్టీ ఎంపీలను కూడా పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు. కవాతు రోజున ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయ సిబ్బంది తమను తీవ్రంగా అవమానించిందన్నారు. ఉద్యమం రగిలిందన్నారు. ముఖ్యమంత్రిపై సభా హక్కుల నోటీసు ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లు ఎంపీలు చెప్పారు.

రాజీనామాలతో తెలంగాణ రాదు.. డికె అరుణ

రాజీనామాలతో తెలంగాణ రాదని మంత్రి డికె అరుణ వేరుగా హైదరాబాదులో అన్నారు. తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అన్నారు. ఈ నెల 8న తాము ఢిల్లీకి వెళ్లి, అధిష్టానాన్ని తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయమని కోరతామని చెప్పారు.

English summary
Congress party senior MP V Hanumanth Rao lashed out at CM Kiran Kumar Reddy for his comments against Telangana. Minister DK Aruna said that Telangana will not come with resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X