• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హీనా-బిలావల్ రొమాన్స్‌లో కొత్త కోణం: రాళ్లతో కొట్టి..?

By Srinivas
|
Bilawal Bhutoo-Hina Rabbani Khar
ఇస్లామాబాద్: పాక్ విదేశాంగ శాఖ మంత్రి హీనా రబ్బానీ ఖర్, పిపిపి నేత బిలావల్ భుట్టోల మధ్య ఎఫైర్ ఉన్నాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. హీనా, బిలావల్‌ల రొమాన్స్ వ్యవహారంపై ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఇస్లామిక్ సంస్థలు వారిపై చర్యలు తీసుకోవాలని లేదా బహిరంగంగా మరణించే వరకు వారిద్దరిని రాళ్లతో కొట్టి శిక్షించాలని చెబుతున్నారట.

ఈ విషయాన్ని కూడా వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని బహిర్గతం చేసిన బ్లిడ్జ్ టాబ్లాయిడ్ తెలిపింది. బ్లిడ్జ్ తెలిపిన వివరాల ప్రకారం... షరియా చట్టం ప్రకారం హీనాను, బిలావల్‌‌ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. వారిద్దరి మధ్య ఎఫైర్ నిజమే అయితే ఇస్లామిక్ చట్టాల ప్రకారం వారు క్షమార్హులు కారని ఓ సంస్థకు చెందిన ప్రముఖులు అన్నారు. బిలావల్‌కు హీనాతో సంబంధాలు ఉన్నా, మత్తు పదార్థాలు సేవించినా అతనికి పార్టీ బాధ్యతలు గానీ, దేశ బాధ్యతలు గానీ తీసుకునేందుకు అనర్హుడని ఆ ప్రముఖుడు తెలిపారు.

పాకిస్తాన్‌లోని చట్టాలు వాటిని అంగీకరించవన్నారు. ఇస్లామిక్ న్యాయసూత్రాల ప్రకారం ఈ చర్య తీవ్రంగా ఖండించదగినదన్నారు. తప్పు చేసి ఉంటే బిలావల్ క్రిమినల్‌గా భావింపబడుతారని, అతను పిపిపి నేతగా ఉండేందుకు అనర్హుడు అని అన్నారు. కాగా పాకిస్తాన్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ తనయుడు, పిపిపి నేత బిలావల్ భుట్టోతో పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌‌కు అఫైర్ ఉందనే వార్తలు ఇటీవల వచ్చిన విషయం తెలిసిందే.

ఈ వార్తలను హీనా రబ్బానీ ఖర్‌తో పాటు ఆమె భర్త కూడా ఖండించారు. అంతేకాదు ఈ విషయం బయటకు రాగానే హీనా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా కూడా వార్తలొచ్చాయి. హీనా, బిలావల్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ గ్రూపులు వారిద్దరికీ ఫత్వా జారీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలొచ్చాయి. పాకిస్తాన్ చట్టాల ప్రకారం అక్రమంగా ప్రేమ వ్యవహారం నడిపితే శిక్షార్హమేనని, కాబట్టి ఫత్వా జారీ చేయవచ్చునని బ్లిడ్జ్ రాసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Alleged love affair between Hina Rabbani Khar and Bilawal Bhutoo might turn into a horrible tale as Muslim community has reacted strongly against the relations. Eminent Islamic scholars, leaders and clergies in Bangladesh recommended whipped or stoned to death for the duo, reported Bangladeshi tabloid Blitz, the first media organization reported on the sensational high profile affair in Pakistan.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more