హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యక్తి దృష్టి మరల్చి 35వేల అమెరికన్ డాలర్ల చోరీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: వ్యక్తి దృష్టి మళ్లించి రూ.18.39 లక్షల విలువ చేసే ముప్పయి అయిదు వేల అమెరికన్ డాలర్లు దొంగలించారు. సికింద్రాబాద్‌లోని మెరీక్యూరి ట్రావెల్స్ యాజమాన్యం అమెరికా డాలర్లు అవసరమై బేగంపేటలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నుంచి 18.39 లక్షల రూపాయలను ఆర్టీజిఎస్ పద్ధతి ద్వారా రాజ్‌భవన్‌ రోడ్డులోని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుకు బదిలీ చేశారు. వాటిని తీసుకోవడానికి శ్రావణ్‌ కుమార్ బ్యాంకుకు వచ్చాడు.

బ్యాంకులో లావాదేవీలు పూర్తి చేసుకున్న తరువాత 35 వేల అమెరికన్ డాలర్‌లను బ్యాగులో పెట్టుకొని బయటకు వచ్చి ద్విచక్ర వాహనంపై కార్యాలయానికి బయలు దేరాడు. పార్క్ హోటల్ సమీపంలో యూటర్న్ తీసుకొని వెళుతుండగా హెల్మెట్లు పెట్టుకొని పల్సర్ వాహనంపై వచ్చిన ఆగంతుకులు షర్ట్ పై పురుగు పడిందని చెప్పారు. అప్పటికే మెడ వెనుకాల దురద పెడుతుండటంతో శ్రావణ్‌ కుమార్ బ్యాగును వాహనం ట్యాంకుపై పెట్టి చూసుకోగా ఆగంతుకులు క్షణాల్లో దాన్ని తీసుకొని పారిపోయారు.

కొద్ది సేపటి తరువాత ఓ వ్యక్తి సంస్థ కార్యాలయానికి ఫోన్ చేసి సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లి వైపు వెళ్లే జీడిమెట్ల బస్సులో ఓ బ్యాగు దొరికిందని తెలిపాడు. బ్యాగులో ఐడీ, విజిటింగ్ కార్డులు, స్టాంపు పత్రాలు ఉన్నాయని చెప్పాడు. దీంతో సిబ్బంది అప్రమత్తమై బ్యాగును తీసుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బ్యాంకు వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట డిఐ సత్తయ్య తెలిపారు.

తాళం పగులగొట్టి బంగారు నగలు చోరీ

కెపిహెచ్‌బి కాలనీలో ఇంటి తాళం పగులగొట్టి దొంగలు భారీ మొత్తంలో నగదును, నగలను అపహరించారు. నాలుగు లక్షల రూపాయల నగదు, పన్నెండు తులాల బంగారు నగలు దోచుకు వెళ్లినట్లుగా బాధితుడు చెప్పారు. కావేరీ ట్రావెల్స్ ఇంచార్జిగా ఉన్న ప్రసాద్ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది.

English summary

 Two motorcyclists snatched a bag containing 35,000 American dollars from a travel company employee by diverting his attention on Raj Bhavan on Wednesday. The victim, K. Sravan Kumar (29) felt extremely itchy on his neck and stopped his motorcycle to check what was wrong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X