హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీరు వారు: కోదండరామ్‌తో భేటీకి కెసిఆర్ నో

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao - Kodandaram
హైదరాబాద్: వీరు వారు, వారు వీరు అవుతారని పెద్దలు ఊరికే అనలేదు. ఇంటి ముంగిటి దాకా వెళ్లిన తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను కలవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇష్టపడలేదు. న్యూడెమొక్రసీ నాయకులను పిలిచీ మరీ ఢిల్లీ పరిణామాలను వివరించిన కెసిఆర్ తనను కలవడానికి వచ్చిన తెలంగాణ జెఎసి నేతలకు మాత్రం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. గురువారం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయడానికి సహకరించిన రాజకీయ పార్టీల నాయకులకు ఒక్కొక్కరికే తెలంగాణ జెఎసి నేతలు గురువారం కృతజ్ఞతలు చెబుతూ వచ్చారు. అదే వరుసలో కెసిఆర్‌ను కూడా కలిసి కృతజ్ఢతలు చెప్పాలని భావించారు. కానీ, కెసిఆర్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. బిజెపి, సిపిఐ నాయకులను, స్వతంత్ర శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిని టిజెఎసి నేతలు కలిశారు.

కెసిఆర్ అపాయింట్‌మెంట్ కోసం ఒకటి రెండు రోజులు ఆగాలని తెరాస సీనియర్ నాయకులు టిజెఎసి నేతలతో చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు పెద్దలతో చర్చలు జరిపి ఢిల్లీ నుంచి తమ నాయకుడు కెసిఆర్ నెల రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చారని, అందువల్ల ఆయనను కలవడానికి ఆగాలని వారు చెప్పారు. తాము కెసిఆర్‌ను ఈ రోజే కలిసి భవిష్యత్తు కార్యాచరణపై మాట్లాడాలని అనుకున్నామని, అయితే కెసిఆర్ తీరిక లేదని, కెసిఆర్‌ను కలవడానికి సమయం పడుతుందని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తమతో చెప్పారని, శనివారంనాడు తమకు కెసిఆర్ అపాయింట్‌మెంట్ లభిస్తుందని అనుకుంటున్నామని టిజెఎసి నాయకులు చెప్పారు.

కెసిఆర్‌ను ఎప్పుడు కలవాలనే విషయం తెరాస నాయకులు చెబుతారని కోదండరామ్ అన్నారు. తాము తెలంగాణ అనుకూల పార్టీల నాయకులందరినీ కలవాలని అనుకున్నామని, అదే వరుసలో కెసిఆర్‌ను కలుద్దామని వచ్చామని, త్వరలో కెసిఆర్‌తో సమావేశం జరుగుతుందని అనుకుంటున్నామని ఆయన వివరించారు.

తెరాస అధ్యక్షుడు కెసిఆర్ న్యూడెమొక్రసీ నాయకులతో సమావేశం కావడమే కాకుండా తమ పార్టీ శాసనసభ్యులతో సమావేశమై ఢిల్లీ పరిణామాలను వివరించారు. టిజెఎసి నాయకులతో కలవకూడదని కెసిఆర్ ఏమీ అనుకోవడం లేదని, టిజెఎసి నేతలతోనే కాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనవారందరినీ ఆయన కలువాల్సి ఉందని, అందరినీ కలిసి రాష్ట్ర సాధనకు పకడ్బందీ వ్యూహరచన చేయాల్సి ఉందని తెరాస నాయకుడు వినోద్ కుమార్ అన్నారు.

ఇదిలావుండగా, తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 7వ తేదీన జరుగనుంది. ఈ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తారు. ఈ సమావేశానికి బిజెపి, సిపిఐ, న్యూడెమొక్రసీ పార్టీలతో పాటు తెరాసను కూడా ఆహ్వానించనుంది.

English summary
The Telangana Joint Action Committee members said TRS supremo K Chandrasekhar Rao refused to meet them when their delegation called on him on Thursday. The delegation was on a thanksgiving visit to the leaders of the various political parties and organisations for making the 'Chalo Hyderabad' march held on September 30 a grand success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X