హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్యాంక్‌బండ్‌పై కవిత ధర్నా, శ్రీకృష్ణపై కోదండరామ్ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavitha
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్‌పై సీమాంధ్రుల విగ్రహాలను తిరిగి ప్రతిష్టించడాన్ని నిరిసిస్తూ తెలంగాణ జాగృతి సంస్థ ఆందోళన బాట పట్టింది. సంస్థ అధ్యక్షరాలు కల్వకుంట్ల కవితతో పాటు కార్యకర్తలు ట్యాంక్‌బండ్‌పై శుక్రవారం ధర్నా చేశారు. రాత్రికి రాత్రి విగ్రహాలను ప్రతిష్టించడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటి తుడుపు చర్యగా మాత్రమే కొమురం భీం విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారని ఆమె అన్నారు. కవితిను, తెలంగాణ జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం పట్టుదలకు పోతే మిలీనియం మార్చ్ ఘటన పునరావృతం అవుతుందని కవిత హెచ్చరించారు.

ఓ కమిటీ వేసి తెలంగాణ మహనీయుల విగ్రహాలను కూడా ప్రతిష్టించాల్సిందని ఆమె అన్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా ధ్వంసమైన విగ్రహాలను ప్రభుత్వం తిరిగి ప్రతిష్టించింది. ప్రభుత్వం తిరిగి నెలకొల్పిన విగ్రహాల్లో గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, సర్ ఆర్థర్ కాటన్‌వి ఉన్నాయి. ధ్వంసమైన విగ్రహాలను పది రోజుల్లో తిరిగి ప్రతిష్టిస్తామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది.

కాగా, తెలంగాణపై అధ్యయనానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీపై తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ మండిపడ్డారు. తెలంగాణ సమాజం ఇచ్చిన సమాచారాన్ని జస్టిస్ శ్రీకృష్ణ తన నివేదికలో పొందుపరచలేదని ఆయన శుక్రవారం విమర్శించారు. వేల కొద్ది పేజీల సమాచారాన్ని ఇచ్చినా పట్టించుకోకపోవడం వల్లనే శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ సమస్యకు పరిష్కారాన్ని చూపలేకపోయిందని ఆయన మీడియాతో అన్నారు.

నివేదికలో ఎనిమిదో అధ్యాయాన్ని ఎందుకు రాశారో జస్టిస్ శ్రీకృష్ణ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ మార్చ్‌కు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలను గత రెండు రోజులుగా కలుస్తున్న తెలంగాణ జెఎసి నేతులు శుక్రవారం తెలంగాణ నగారా సమితి నేతలను కలిశారు. మార్చ్‌ను విజయవంతం చేసినందుకు వారు నాగం జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Kalwakuntla Kavitha along with her Telangana Jagruthi activists staged dharna at Tankbund in Hyderabad protesting against re-installation of statues, which were damaged during millennium march.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X