హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మ క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి, వాద్రాపై ఎర్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: తనయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్ ఆస్తులపై విజయమ్మ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కోరారు.

సాక్షి అవినీతి పత్రిక అని తేలిపోయిందని అన్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేకమేడలా కూలే పరిస్థితి వచ్చిందని సోమిరెడ్డి అన్నారు. ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో విజయమ్మ చెప్పాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలన లేదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తుంటే కాంగ్రెసు నాయకుల కాళ్లు నొప్పి పెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆస్తులపై సిబిఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె. ఎర్రంనాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆయన శనివారం శ్రీకాకుళంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో ఎవరికి డిక్లరేషన్ ఇస్తారో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెసుకు ఇవే చివరి ఎన్నికలని వ్యాఖ్యానించారు.

English summary
Telugudesam leader Somireddy Chandramohan Reddy demanded apology from public on her son YS Jagan properties. He said that Vijayamma should clarify on Jagan's properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X