వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పింక్ రిబ్బన్ వాక్‌లో మోహన్ బాబు, వివిఎస్, అమల

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున సతీమణి అమల, ప్రముఖ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితర సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కెబిఆర్ పార్క్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదిగా తిరిగి కెబిఆర్ పార్క్‌కు చేరుకుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా వీరు రెండు కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. అందరూ వ్యాధుల పైన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు అయినప్పటికీ వ్యాధుల గురించి మాట్లాడుకోవడంలో తప్పు లేదన్నారు. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవాలని మోహన్ బాబు ఈ సందర్భంగా సూచించారు. అనంతరం అమల మాట్లాడుతూ... రొమ్ము క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.