హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియురాలిపై కత్తితో దాడి: కోరిక తీర్చలేదని ఘాతుకం

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Young girl attacked by youth in Hyderabad
హైదరాబాద్/ప్రకాశం: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి నో చెప్పడంతో ఉన్మాదిగా మారి యువతి పైన, ఆమె తల్లి పైన కత్తితో దాడి చేశాడు. నగరంలోని నాగోల్ సమీపంలోని సాయి నగర్‌లో ఆదివారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న కల్యాణ్ అనే యువకుడు రెండేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె మొదటి నుండి నిరాకరిస్తూనే ఉంది.

తన ప్రేమను ఎంతకూ అంగీకరించక పోవడంతో కల్యాణ్ ఉన్మాదిగా మారిపోయాడు. ఉదయం ఓ కత్తి తీసుకొని సాయి నగర్‌లో ఉంటున్న అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి ఆమె పైన, ఆమె తల్లి పైన కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అతను మాత్రం వారి నుండి తప్పించుకొని పరారయ్యాడు. ఈ యువతి, కల్యాణ్ గతంలో ఓ జ్యూవెల్లరీ దుకాణంలో కలిసి పని చేశారు. అప్పటి నుండే అతను ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు.

కోరిక తీర్చలేదని యాసిడ్ దాడి

తన కోరిక తీర్చలేదని ఓ వ్యక్తి మహిళపై యాసిడ్‌తో దాడి చేసిన సంఘటన జరిగింది. ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు మండలం వంకాయలపాడులో రామారావు అనే వ్యక్తి ప్రమీల అనే మహిళపై యాసిడ్‌తో దాడి చేశాడు. బాధితురాలిని వెంటనే స్థానికులు చీరాల ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేసి రెండు కళ్లు దెబ్బతిన్నాయని, శరీర భాగం 40 శాతం ఖాలీ పోయిందని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి భర్త కాలం చేశారు. ఈమెకు కొంతకాలంగా నిందితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె తన కోరిక తీర్చక పోవడంతో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది.

English summary
A young girl and her mother was attacked by youth in Hyderabad on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X