వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకోసం కొత్త పార్టీ: టిఆర్ఎల్డీ ప్రెసిడెంట్‌గా ఇందిర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ajith Singh
హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం ఆ ప్రాంతంలో కొత్త పార్టీ పుట్టుకు వచ్చింది! అయితే జాతీయస్థాయిలో పేరున్న ఆర్ఎల్డీ తెలంగాణలో పార్టీ వింగ్‌ను తెలంగాణలో తెలంగాణ ఆర్ఎల్డీగా నామకరణం చేస్తూ ఆదివారం ప్రారంభించింది. ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాదులోని సుందరయ్య కళాభవనంలో పార్టీని ప్రారంభించారు. 57 మందితో పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించారు.

తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత కపిలవాయి దిలీప్ కుమార్ సతీమణి కపిలవాయి ఇందిరను తెలంగాణ ఆర్ఎల్డీ అధ్యక్షురాలిగా అజిత్ సింగ్ నియమించారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా రమా మధుసూధన్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మహ్మద్ రియాజ్‌ను నియమించారు. ఈ సందర్భంగా అజిత్ సింగ్ మాట్లాడారు.

తెలంగాణ తరహా ఉద్యమాన్ని తాను దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. ఉద్యమం గ్రామగ్రామాన విస్తరించడంతో ప్రజాప్రతినిధులు తమ సొంత నియోజకవర్గాలలో కూడా తిరగలేక పోతున్నారన్నారు. తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా ఉందన్నారు. సకల జనులు ఉద్యమంలో పాల్గొంటున్నారని, దేశంలో ఇంత పెద్ద ఆందోళన లేదన్నారు. వచ్చే ఎన్నికలలో తాము తెలంగాణ ఆర్ఎల్డీ తరఫున పోటీ చేస్తామని చెప్పారు.

కాగా అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న అజిత్ సింగ్... తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టతరమని అన్నారు. ఆయన ఆర్ఎల్డీ తెలంగాణ శాఖను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలతో సమావేశమయ్యారు. అనంతరం అజిత్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తుందని ప్రకటనలు ఏళ్ల తరబడి వింటూనే ఉన్నామన్నారు. తెలంగాణవారంతా ఏకతాటిపై ఉన్నారన్నారు.

తెలంగాణ సాధన కోసం కాంగ్రెసు ఎంపీలు కట్టుబడి ఉన్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పోరాడితే లక్ష్యం నెరవేరుతుందన్నారు. తనకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఢిల్లీలో తెలంగాణకు సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఐక్యంగా పోరాడాలన్నారు. తెలంగాణ అంశం చాలా ఏళ్లుగా కొనసాగుతోందని, ఇటీవల జరిగిన కవాతు పైన ఢిల్లీలో కూడా చర్చ జరిగిందన్నారు.

English summary
RLD chief and central minister Ajith Singh has launched Telangana RLD party in Telangana on Sunday. He was appointed Kapilavai Indira as party president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X