హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు సిఎంగా ఉంటే బాలకృష్ణ జైల్లోనే: టిడిపి నేత ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sankineni Venkateswara Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై సొంత పార్టీకి చెందిన మరో సీనియర్ నేత దుమ్మెత్తి పోశారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర రావు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హీరో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు కాబట్టి బాబుకు మద్దతిస్తున్నారని, అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే బాలయ్య బాబు ఇప్పటి వరకు బయటకు రాకుండా జైలులోనే ఉండేవాడని ఆరోపించారు.

చంద్రబాబు కాంగ్రెసు పార్టీతో కలిసిపోయారని, వచ్చే సాధారణ ఎన్నికలలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి పాలన అందించాలనే సదుద్దేశ్యంతో పార్టీని స్థాపించారన్నారు. జగన్‌ను ఎదుర్కోలేని చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అతన్ని జైలులోనే ఉంచాలని కుటిల యత్నాలు చేస్తున్నారన్నారు.

అందుకు నిరసనగానే తాను జగన్‌ను జైలులో కలిశానన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించానని చెప్పారు. కాంగ్రెసుతో కుమ్మక్కైన చంద్రబాబు జగన్‌ను జైలులోనే ఉంచి కాంగ్రెసును గెలిపించడమో లేక తాను గెలవడమో చేయాలని చూస్తున్నారన్నారు. అయితే ఆయనవన్నీ పగటి కలలుగానే మిగిలిపోతాయన్నారు. ఆలేరు, తుంగతుర్తి తదితర నియోజకవర్గాల నుండి భారీగా టిడిపి నేతలు, కార్యకర్తలు జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

తాను భవిష్యత్తుపై తన మద్దతుదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఎవరెవరు జగన్ పార్టీలో చేరుతారో కాలమే నిర్ణయిస్తుందన్నారు. చంద్రబాబు నిర్ణయాలు నచ్చక తాను చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నానని చెప్పారు. బాబుకు విశ్వసనీయత లేదని, పచ్చి అవకాశవాది అన్నారు. ఆయనది విపక్ష నేతలు చెబుతున్నట్లు కేవలం యూజ్ అండ్ త్రో పాలసీ కాదని.. యూజ్ అండ్ త్రో అండ్ కట్ పాలసీ అన్నారు. అవకాశవాద రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడన్నారు.

English summary
Nalgonda district senior Telugudesam Party leader has lashed out at party chief Nara Chandrababu Naidu on Monday. He was met YSR Congress party chief YS Jaganmohan Reddy on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X