హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హల్‌చల్: చార్మినార్ వద్ద అక్కినేని అమల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Akkineni Amala
హైదరాబాద్: సనీనటి, హీరో నాగర్జున సతీమణి అక్కినేని అమల గ్రీన్‌పీస్ సభ్యులతో కలిసి హైదరాబాదులోని పాతబస్తీలో గల చార్మినార్ వద్ద సోమవారం హల్‌చల్ చేశారు. అక్కినేని అమలను, గ్రీన్‌పీస్ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ జీవ సదస్సు సందర్బంగా చైతన్యం కలిగించడానికి తాము ఈ ప్రదర్సన నిర్వహించినట్లు అక్కినేని అమల చెప్పారు.

చారిత్రక కట్టడం చార్మినార్ కట్టడంపై పర్యావరణ పరిరక్షణ బ్యానర్లు కట్టినందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. బొగ్గు తవ్వకాలను ఆపాలి, అడవులను పరిక్షించాలి అనే నినాదం రాసి ఉన్న బ్యానర్లను అనుమతి లేకుండా అమల చార్మినార్‌పై కట్టారు. చారిత్రక కట్టడం కావడంతో చార్మినార్‌పై అనుమతి లేకుండా ఏ విధమైన బ్యానర్లు కట్టకూడదని పోలీసులు అంటున్నారు.

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ 13 కోల్ బ్లాక్‌లకు అనుమతి ఇచ్చారని, బొగ్గు తవ్వకాలు గిరిజనులను, జంతువులను నిరాశ్రయులను చేస్తున్నాయని, ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నాయని ఆమె విమర్సించారు. జంతువుల మనుగడ బొగ్గు తవ్వకాల వల్ల దెబ్బ తింటోందని ఆమె మీడియాతో అన్నారు.

పోలీసులు అక్కినేని అమలను, గ్రీన్‌పీస్ సభ్యులను చార్మినార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అమల అరెస్టు విషయాన్ని సినీ హీరో అక్కినేని నాగార్జునకు, ఆమె కుటుంబ సభ్యులకు అందించారు. వారు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
Actress and cine hero Akkineni Amala and Green Peace members have been arrested at Charminar in the old city of Hyderabad for exhibiting banners on Charminar. Akkineni Amala has been shifted to the Charminar PS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X