వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీ ఛానల్‌పై జిందాల్ కంపెనీ బ్లాక్‌మెయిల్ కేసు, ఖండన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jindal Logo
ఢిల్లీ: ఓ ఛానల్ యాజమాన్యం జిందాల్ గ్రూప్ కంపెనీని బ్లాక్ మెయిల్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. సాధారణంగా మీ కంపెనీ మీద ఫలానా కథనం చేశామని, దాన్ని ప్రసారం చేయాలా వద్దా అని కొంతమంది టివి చానళ్ల విలేకరులు పారిశ్రామిక సంస్థలను బ్లాక్‌మెయిల్ చేసిన సంఘటనలు గతంలో కొన్ని వెలుగులోకి వచ్చాయి. కానీ, ఏకంగా ఒక చానల్ యాజమాన్యమే ఓ బడా కంపెనీని ఇలా బ్లాక్‌మెయిల్ చేయడమంటే.. చిన్న విషయం కాదు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు గనుల స్కాంలో కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్‌కు చెందిన కంపెనీకి కూడా అనుచిత లబ్ధి కలిగిందన్న వార్తలు ఇంతకుముందు వచ్చాయి. ఈ విషంలో జీ బిజినెస్ చానల్ తమను బెదిరించిందని, రూ.50 కోట్లు ఇవ్వకపోతే ఈ కుంభకోణంపై తమ మీద ప్రత్యేక కథనం చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేసిందని నవీన్ జిందాల్‌కు చెందిన కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో.. కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులలోని క్రైం బ్రాంచి విభాగం జీ బిజినెస్ చానల్ వర్గాలపై బలవంతపు వసూళ్ల కేసును నమోదు చేసింది. అయితే, ఈ ఆరోపణలన్నీ కట్టుకథలేనని, తమను ఇలాంటి కథనాలు ప్రసారం చేయకుండా ఒత్తిడి చేసే వ్యూహమేనని చానల్ అధినేత సుధీర్ చౌదరి అన్నారు. బొగ్గు గనుల కుంభకోణంపై అధికార పత్రాల ఆధారంగా తాము అనేక కథనాలు రూపొందించామని, అవినీతిపై తమ అలుపెరుగని పోరాటాన్ని అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆయన చెప్పారు.

English summary
A top executive of a company owned by Congress MP Naveen Jindal has filed an FIR against Sudhir Chaudhary, eidtor of Zee news and another top executive of Zee Business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X