వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో భారీ సెక్స్ రాకెట్ రట్టు: 116 మందికి విముక్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Racket busted in Navi Mumbai, 116 recued
ముంబయి: నవీ ముంబయిలోని తుర్భే టౌన్‌షిప్‌లో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. రెండు స్వచ్ఛంద సంస్థల సహకారంతో శనివారం అర్ధరాత్రి రంగంలోకి దిగినపోలీసులు మెరుపుదాడి నిర్వహించి 116 మంది సెక్స్‌వర్కర్లకు విముక్తి కలిగించారు. ఈ విషయాన్ని ఆదర్శ్ సమాజ్ సేవక్ సంఘ్ అధ్యక్షుడు అఫ్జల్‌ ఖాన్ వెల్లడించారు. ఆదివారం ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ మొత్తం 116 మంది సెక్స్‌వర్కర్లకు విముక్తి కలిగిందని చెప్పాడు.

అందులో 26 మంది మైనర్ బాలికలు కూడా ఉన్నారన్నారు. రెస్క్యూ ఫౌండేషన్ అనే మరో స్వచ్ఛంద కూడా ఇందుకు సహకరించిందన్నారు. ఇదే విషయమై పోలీసులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. అయితే తాము దాడి జరిపిన ప్రతిసారీ అక్కడి నుంచి వెళ్లిపోతున్నారని, తిరిగి వస్తున్నారన్నారు. తుర్భేలో వ్యభిచారం జరుగుతున్న ప్రాంతం చాలా దూరంగా ఉంటుందని, దానిచుట్టూ కొండలు ఉంటాయన్నారు.

అందువల్ల ఇక్కడికి తరలించిన మహిళలు తప్పించుకోవడం ఎంతో కష్టమన్నారు. ఒకవేళ ఎవరైనా తప్పించుకుందామని ప్రయత్నించినా సులువుగా దొరికిపోతారన్నారు. దీంతో నిర్వాహకులు వారిని తిరిగి బలవంతంగా ఈ రొంపిలోకి దింపుతున్నారన్నారు. అక్కడ ఆవాసాలు కూడా తక్కువగా ఉంటాయన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో నివసించేవారికే దీని గురించి తెలుస్తుందన్నారు.

లైంగిక వేధింపు కేసులో రెండేళ్ల జైలు శిక్ష

యజమాని మైనరు కూతురును లైంగిక వేధించిన కేసులో నగర కోర్టు ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. టీకొట్టులో పని చేసే ఓ ఉద్యోగి యజమాని ఐదేళ్ల కూతురును లైంగిక వేధించినట్లు నిరూపణ అయిందని పేర్కొంటూ అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్న అదనపు సెషన్స్ జడ్జి మధు జైన్ ప్రకటించారు. నిందితునిపై ఉన్న అత్యాచార ఆరోపణల నుంచి మాత్రం విముక్తి కల్పించారు. విచారణ సమయంలోనే దోషి ఆతిక్ ఆలం రెండేళ్లుగా జైలులో ఉన్నందున, అతడిని విడుదల చేయాలని ఆదేశించారు.

English summary

 A massive prostitution racket was bust ed in the Turbhe township of Navi Mumbai late Saturday, an official said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X