టిడిపిలో భయం: అంబటి, పైన జెండా తీసేశారు: దాడి

తమ పార్టీపై తెలుగుదేశం పార్టీ నేతలు చవకబారు ఆరోపణలు చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. టిడిపి నేత దాడి వీరభద్ర రావు దారి తప్పి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలలో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కాంగ్రెసు పార్టీతో రహస్య ఒప్పందం చేసుకున్న నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీదే అన్నారు. తమ పార్టీకి ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదన్నారు.
విలీనం దిశగా జగన్ పార్టీ.. దాడి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీలో విలీనం అయ్యేందుకు సిద్ధమవుతోందని తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు అంతకుముందు ఆరోపించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ భేటీ అనంతరం జగన్ అధికారిక నివాసంపై ఉన్న పార్టీ జెండాను తీసేశారని విమర్శించారు. ఇది విలీనానికి తొలి మెట్టు అని దాడి వీరభద్ర రావు మంగళవారం ఆరోపించారు.
జగన్‌కు బెయిల్ రావాలని, కేసులు పక్కన పెట్టాలనే అజెండాతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం పని చేస్తోందన్నారు. విజయమ్మ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, మరో నేత వైవి సుబ్బారెడ్డితో ప్రణబ్‌ను కలిసి జగన్ భవిష్యత్తు పైనే మొర పెట్టుకుందని విమర్శించారు. బెయిల్ ఇచ్చి, కేసులు పక్కన పెడితే కాంగ్రెసులో విలీనం చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications