మంత్రి ఇంటిమీదుగా బాబు: చేతులూపిన అనుచరులు

కాగా అంతకుముందు చంద్రబాబు పాదయాత్ర కళ్యాణదుర్గం శివార్లలోని ఎర్రంపల్లి క్రాస్ నుంచి ప్రారంభమైంది. చంద్రబాబు వెంట పెద్ద సంఖ్యలో ప్రజలు, అభిమానులు వచ్చారు. ఈ రోజుతో బాబు యాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఎర్రంపల్లి క్రాస్ వద్ద ఉదయం 10.45 నిమిషాలకు ప్రారంభమైన పాదయాత్ర కళ్యాణదుర్గం వైపుకు సాగింది. అక్కమ్మ దేవాలయంలో వద్ద వడ్డెర్ల సంఘం సభ్యులు ఆయనకు సంఘీభావం తెలిపారు.
ఓ సుత్తిని బహూకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. వడ్డెర్లను ఎస్సీల జాబితాలో చేర్చాలన్న వారి డిమాండుకు మద్దతు తెలిపారు. వడ్డెర్ల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. కళ్యాణదుర్గంలోని వాల్మికీ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులు అర్పించారు. తాము అధికారంలోకి వస్తే వాల్మికీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications