• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చాక్లెట్ పెడితే మూడేళ్ల చిన్నారి చేయిని తినేసిన పులి

By Srinivas
|

Tiger bites off toddler's forearm at Bellary zoo
బెంగళూరు: కర్నాటకలోని బళ్లారి నగరంలోని ఓ జంతు ప్రదర్శన శాలలో సరదాగా జంతువులు, పక్షులను చూసేందుకు వచ్చిన బాలుడు పులి దాడికి గురయ్యాడు. బాలుడు పులికి చాక్లెట్ పెట్టబోతే అది ఆ బాలుడి ఎడమ చేతిని కొరికేసింది. మూడేళ్ల బాధితుడు నిఖిల్ సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తన అమ్మమ్మ, ఇతరులతో కలిసి సరదాగా జూ చూసేందుకు వచ్చాడు. అందరూ జంతువులను ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సమయంలో నిఖిల్ తన వెంట తెచ్చుకున్న వేరుశనగకాయలను జింకలకు పెట్టాడు. మిగతా వారంతా జింకల దగ్గర ఉండగా ఇతడు మాత్రం పక్కనే ఉన్న పులి బోను వద్దకు వెళ్లాడు. అక్కడకు వెళ్లిన నిఖిల్ తన వద్ద ఉన్న చాక్లెట్‌ను పులి నోట్లో పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ పులి క్షణాల్లో చిన్నారి ఎడమ చెయ్యిని నోట కరుచుకుంది. ఒక్కసారిగా బోనులోకి చెయ్యిని లాక్కొని తినేసింది. దీంతో బాలుడు ఆర్తనాదాలు పెట్టాడు.

ఇది విన్న అతని అమ్మమ్మ అక్కడకు వచ్చేలోపు దారుణం జరిగింది. వెంటనే జూ సిబ్బంది, సందర్శకులు అక్కడకు వచ్చి బాలుడిని రక్షించారు. నిఖిల్‌ను వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిఖిల్ రామనగర్ జిల్లా చెన్నపట్టణ గ్రామానికి చెందిన నాగబాబు, లక్ష్మీల తనయుడు.

English summary
In a tragic incident here on Monday, a tiger at the Bellary zoo bit off the forearm of a toddler who was attempting to feed the animals chocolate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more