హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ తప్ప: డికె అరుణ, షిండేపై పాల్వాయి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DK Aruna
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ తప్ప ఏదీ వద్దని తాము పార్టీ అధిష్టానంతో చెప్పామని మంత్రి డికె అరుణ గురువారం చెప్పారు. ఆమె నాలుగు రోజుల క్రితం తెలంగాణ కోసం పలువురు జిల్లా నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా తాము పార్టీ సీనియర్ నేతలు, ఫెర్నాండేజ్, మోతీలాల్ వోరా, సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్ తదితరులతో మాట్లాడమని చెప్పారు.

అందరు నేతలతోనూ తమకు తెలంగాణ తప్ప ఎలాంటి ప్యాకేజీ ఇతరత్రా వద్దని చెప్పామన్నారు. బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసినట్లు చెప్పారు. తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూడా కోరామన్నారు. అలాగే వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా ఆదుకోవాలని కోరినట్లు చెప్పారు. జడ్చర్ల నుండి రైల్వే లైన్ వేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఆలంపూర్ జోగులాంబ రైల్వే స్టేషన్‌ను పునరుద్దరించే చర్యలు చేపట్టాలని చెప్పామన్నారు.

షిండే తెలుసుకొని మాట్లాడాలి.. పాల్వాయి

కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణపై తెలుసుకోని మాట్లాడితే బాగుంటుందని పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. చర్చల ప్రక్రియ సంగతి తెలుసుకోకుండానే ఆయన మాట్లాడినట్లుగా కనిపిస్తోందన్నారు. షిండే వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు.

తమ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో గత కొంతకాలంగా తెలంగాణపై చర్చలు జరుపుతోందన్నారు. సిడబ్లుసి సభ్యులు కూడా చర్చల్లో పాల్గొంటున్నారని తెలిపారు. కెసిఆర్‌తో జరుపుతున్న చర్చలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని అన్నారు.

English summary
Minister DK Aruna said on Thursday in New Delhi that they appealed party seniors to announced Telangana soon. Palvai Govardhan Reddy has condemned home minister Sushil Kumar Shinde statement in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X