ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపిలాగే జగన్‌ పార్టీ: కిరణ్, బాబు యాత్రపై కామెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ లాగే తమకు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా విపక్ష పార్టీయేని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం అన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో మూడో రోజు ఇందిర బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపిలా వైయస్సార్ కాంగ్రెసు కూడా తమకు ప్రత్యర్థే అని ఆయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలు మూడోసారి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తే తమకు అభ్యంతరం ఏమీ లేదన్నారు. అయితే బాబుకు ప్రజా సేవ చేయాలనే ఆలోచన కొద్దిగా కూడా లేదన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అబద్దాలు చెబుతుంటారని ఆరోపించారు. ఆయన ఇప్పటికైనా నిజాలు చెబితే బాగుంటుందని సూచించారు.

పూర్తిగా అధ్యయనం చేశాకే రాజీవ్ యువకిరణాలు పథకాన్ని ప్రారంభించామని ఆయన చెప్పారు. ఈ పథకం కింద రోజుకు వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం గురించి కొందరు అర్థం కాక ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అర్థం కాకుండే చేసే విమర్శలను తాను పట్టించుకునేది లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి పైనే కాంగ్రెసు ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు.

ప్రతి ఒక్కరికి చదువు చాలా ముఖ్యమన్నారు. సంపాదించిన డబ్బు పోవచ్చు గానీ చదువు మాత్రం ఎప్పుడూ ఎక్కడికీ పోదన్నారు. దేశం మొత్తంలో ప్రభుత్వ రుణాలతో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలే అని ముఖ్యమంత్రి చెప్పారు.

English summary
CM Kiran Kumar Reddy on Thursday in Prakasam district said that YSR Congress party is Congress's opposition like Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X