హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ రెడ్డి, చంద్రబాబు మధ్య మాటల యుద్ధం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం పెరిగింది. చంద్రబాబుపై కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబుపై విమర్శల విషయంలో దూకుడు పెంచారు. ఇటీవలి ఇందిరమ్మబాటలో చేసిన ప్రసంగాల్లోనూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ ఆయన చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసినవారిలో చంద్రబాబు మించిన అవినీతిపరుడు లేడని ఆయన వ్యాఖ్యానించారు. ఐఎంజి వ్యవహారంలో చంద్రబాబుపై సిబిఐ దర్యాప్తు జరుగుతుందని అన్నారు.

చంద్రబాబు కూడా వెనక్కి తగ్గడం లేదు. వస్తున్నా మీకోసం పేరుతో చేస్తున్న పాదయాత్రలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, కాంగ్రెసు ప్రభుత్వంపై విరుచుకపడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపైనే కాకుండా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై ఆయన మాటల తూటాలు విసురుతున్నారు. కాంగ్రెసును తల్లి కాంగ్రెసుగా, వైయస్సార్ కాంగ్రెసును పిల్ల కాంగ్రెసుగా ఆయన అభివర్ణిస్తున్నారు.

చాలా కాలంగా ఎక్కువగా మాట్లాడకుండా మౌనం పాటిస్తూ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రకాశం జిల్లాలో మూడు రోజుల పాటు జరిగిన ఇందిరమ్మ బాటలో శివాలెత్తారు. తన సహజశైలికి భిన్నంగా వ్యాఖ్యలు చేశారు. ఐఎంజి భూముల వ్యవహారంపై సిఎం చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. చంద్రబాబు పాదయాత్రనే కాదు, చేతుల మీద నడిచినా ప్రజలు విశ్వసించబోరని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో చివరి రోజు ఇందిరమ్మ బాటలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వివిధ పథకాలు ఎలా నీరుగారిపోయాయో లెక్కలతో సహా చెప్పడానికి ప్రయత్నించారు.

కిరణ్ కుమార్ రెడ్డి‌, చంద్రబాబు మాటల యుద్ధంతో రెండు పార్టీలలో కూడా వేడి పెరిగిపోయింది. కాంగ్రెస్‌ పక్షాన 20 సూత్రాల అమలు కమిటీ చెైర్మన్‌ తులసీరెడ్డి, శాసనమండలి విప్‌ వెై.శివరామిరెడ్డి, ఇంకా మరి కొందరు నేతలు చంద్రబాబు టార్గెట్‌గా మీడియా సమావేశాలలో తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేత కింజరాపు ఎరన్న్రాయుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు, శాసనసభ మాజీ స్పీకర్‌ యనమల రామకృష్ణుడు, అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి, శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ సహా పలువురు నేతలు ఇటు కిరణ్‌ కుమార్ రెడ్డిని, అటు జగన్‌ను లక్ష్యంగా చేసుకొని మాటల యుద్ధం పెంచారు.

English summary

 War of words between CM Kiran kumar Reddy and Telugudesam president N Chandrababu Naidu has reached at peak. Kiran kumar Reddy in his Indiramma Baata directly made allegations against Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X