హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijay Mallya
హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై హైదరాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టు శుక్రవారం ఈ వారంట్ జారీ చేసింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టింది. దీంతో కింగ్‌ఫిషర్ అధినేత మాల్యాకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ అయింది.

వినియోగ చార్జీల నిమిత్తం 10.3 కోట్ల రూపాయల విలువ చేసే నాలుగు చెక్కులను కింగ్‌ఫిషర్ జిఎంఆర్‌కు ఇచ్చింది. అవి చెల్లలేదు. దాంతో జిఎంఆర్ కేసు నమోదు చేసింది. సమన్లు జారీ చేసినప్పటికీ మాల్యా హాజరు కాకపోవడంతో 13వ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది.

తాను విదేశాల్లో ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి తనను మినహాయించాలని మాల్యా కోర్టును కోరినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మాల్యాతో పాటు సిఇవో సంజయ్ అగర్వాల్ కూడా ప్రతివాదులుగా ఉన్నారు. పార్కింగ్, ల్యాండింగ్, నావిగేషన్ చార్జీల కింద కింగ్‌ఫిషర్ జిఎంఆర్‌కు చెక్కులు ఇచ్చింది.

ఇంతకు ముందు 2012 జూన్‌లో జివికె గ్రూప్ నడుపుతున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇదే విధమైన చెక్కు బౌన్స్ కేసును ముంబై క్రిమినల్ కోర్టులో కింగ్‌ఫిషర్‌పై వేసింది. ఢిల్లీ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జిఎంఆర్ మూడు కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసును కింగ్‌ఫిషర్‌పై ఇదివరకు వేసింది.

కింగ్‌ఫిషర్ 2012 జూన్ 30వ తేదీతో ముగిసిన త్రైమాసికంలో 651 కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయింది.

English summary
A non-bailable warrant has been issued against Kingfisher Airlines (KFA) chairman Vijay Mallya. A Hyderabad court on Friday, Oct 12 issued the warrant fueling speculations on Mallya's imminent arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X