• search
  • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వీడుతున్న కన్నడ నటి హేమశ్రీ మృతి మిస్టరీ

By Pratap
|

Hemasri
అనంతపురం: కన్నడ నటి హేమశ్రీ మృతి కేసు మిస్టరీగా మారింది. హేమశ్రీని హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక కూడా అదే విషయాన్ని తేల్చినట్లు సమాచారం. హేమశ్రీ తల మీద, చెక్కిళ్ల మీద, పక్కటెముకల మీద బలమైన గాయాలున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలినట్లు వార్తలు వస్తున్నాయి.

అనంతపురంలోని ఓ ఫామ్‌హౌస్‌కు చెందిన కాంగ్రెసు నాయకుడి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఫామ్‌హౌస్‌కు చెందిన మురళిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మురళి, హేమశ్రీ భర్త సురేంద్రబాబు వ్యాపార భాగస్వాములని అంటున్నారు. హేమశ్రీది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలిందని వార్తలు వచ్చాయి.

ఫామ్‌హౌస్‌ సిబ్బందిని బెంగళూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సురేంద్రబాబు తన నేరాన్ని అంగీకరించినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ధ్రువీకరించడం లేదు. భార్య హేమశ్రీని హైదరాబాదుకు తీసుకుని వస్తూ సురేంద్ర బాబు ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు.

హేమశ్రీ కేసులో అనవసరంగా తన పేరును ముందుకు తెస్తున్నారని మురళి ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ మనుగడను ఓర్వలేక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ఫామ్‌హౌస్‌కు రావడానికి ముందే హేమశ్రీ మరణించిందని పోస్టుమార్టంలో తేలినట్లు ఆయన తెలిపారు. పోలీసులు తనను కూడా ప్రశ్నించారని ఆయన చెప్పారు. హేమశ్రీ భర్త సురేంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

కర్నాటకకు చెందిన ప్రముఖ టివి నటి హేమశ్రీ(30) అనుమానాస్పద స్థితిలో మరణించింది. అక్టోబర్ 9వ తేదీ రాత్రి పది గంటల సమయంలో తీవ్ర అస్వస్థతగా ఉందంటూ ఆమె తన భర్త ముప్పయ్యేడేళ్ల సుధీంద్ర, ఆమెను కారులో బెంగళూరు నగర శివారులోని బాప్టిస్టు ఆసుపత్రికి తీసుకు వచ్చారు.

అప్పటికే ఆమె మరణించినట్లుగా బాప్టిస్టు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. సుధీంద్ర పోలీసులుకు తెలిపిన వివరాల మేరకు.. చెన్నైలోని తమిళ సీరియల్ షూటింగు ముగించుకొని హేమశ్రీ బెంగళూరుకు చేరుకున్నారు. మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇద్దరూ కారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆమె అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి భర్త తీసుకుని వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

English summary
Kannada film and TV serial actor Hemasri, 30, died under mysterious circumstances on Tuesday. The actor and her husband Surendra Babu, residents of Banashankari, were driving in a car to Anantapur in Andhra Pradesh when she allegedly developed complications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X