వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేమశ్రీ కేసులో వీడిన చిక్కుముడి: కాపురంచేయట్లేదని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hemasri
బెంగళూరు: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన టివి యాంకర్ హేమశ్రీ కేసు మిస్టరీని కర్నాటక పోలీసులు ఛేదించారు. హేమశ్రీపై విషప్రయోగం జరిగిందని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో బయటపడింది. దీంతో ఈ వ్యవహారంలో హేమశ్రీ భర్త సురేంద్ర బాబును, ఆయన డ్రైవర్ సతీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేశారు. బెంగళూరులోని కగ్గదాసపురకు చెందిన సురేంద్ర వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

భూలావాదేవీలకు సంబంధించి బెంగళూరులోని బయ్యప్పనహళ్లి పోలీసు స్టేషన్‌తో పాటు నగరంలోని అనేక పోలీసు స్టేషన్లలో సురేంద్రపై 25కు పైగా కేసులు ఉన్నాయని సమాచారం. ఓ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్న హేమశ్రీ తండ్రి నాగరాజ్ ఫోర్జరీ కేసులో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్న సురేంద్ర... ఈ కుటుంబానికి దగ్గరయ్యాడు. హేమశ్రీ అందానికి ఆకర్షితుడై ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాల్సిందిగా నాగరాజుపై ఒత్తిడి తెచ్చాడు.

ఈ నేపథ్యంలో హేమశ్రీ ఏడాది క్రితం ఇష్టం లేకపోయినా సురేంద్రను వివాహం చేసుకుంది. వివాహమైనా ఇంతవరకు వీరిద్దరు కలిసి కాపురం చేయలేదని తెలుస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న భర్త పథకం ప్రకారం హేమశ్రీని అంతం చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా తన స్నేహితుడితో హేమశ్రీ తన భర్తపై ఫోన్‌లో చెప్పిన సంభాషణలు దుమారం రేపాయి.

తనకంటే ముందు నలుగురు యువతులను తన భర్త వివాహం చేసుకున్నాడని, అతనో లైంగిక ఉన్మాది అని ఆమె తన స్నేహితుడితో చెప్పినట్లుగా తెలుస్తోంది. భర్త తీరుపై హేమశ్రీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా ఆ తర్వాత ఉపసంహరించుకుంది. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు.

English summary

 Kannada film and TV serial actor Hemasri, 30, died under mysterious circumstances on Tuesday. The actor and her husband Surendra Babu, residents of Banashankari, were driving in a car to Anantapur in Andhra Pradesh when she allegedly developed complications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X