హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆజాద్ వ్యాఖ్య వక్రీకరణ: గండ్ర, షర్మిలయాత్రపై కామెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gandra Venkataramana Reddy
హైదరాబాద్: తెలంగాణపై కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు విపరీతార్థాలు తీస్తున్నారని ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకటరమణ రెడ్డి సోమవారం అన్నారు. ఆజాద్ వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదన్నారు. ఆయన ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని గండ్ర చెప్పారు. రాజకీయాలతో తెలంగాణ రాదని ఎప్పుడో తెలిపోయిందన్న ఆజాద్ వ్యాఖ్యలకు వక్రీకరిస్తున్నారన్నారు.

తెలంగాణ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసమే వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు ఎలాంటి హామీలకైనా బాబు సిద్ధంగా ఉన్నారన్నారు. తన పాలనలో సమస్యలను పరిష్కరించలేదని బాబు అంగీకరిస్తున్నారని, కొద్ది రోజుల తర్వాత చనిపోయిన వ్యక్తికి కూడా ప్రాణం పోస్తానని చెబుతారని ఎద్దేవా చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుందో లేదోనన్న అనుమానంతో అధికారం కోసం షర్మిల పాదయాత్ర చేపడుతున్నారని గండ్ర విమర్శించారు. చంద్రబాబు, షర్మిలలు చేస్తున్న పాదయాత్రలు కేవలం అధికారం కోసమే తప్ప ప్రజల కోసం మాత్రం కాదన్నారు.

కాంగ్రెసు పరిష్కరిస్తుంది

తెలంగాణ సమస్యను కాంగ్రెసు పార్టీ మాత్రమే పరిష్కరించగలదని ఏఐసిసి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పార్టీ కసరత్తు చేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో దేశ బడ్జెట్‌కు కూడా సరిపోని హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు.

English summary
Government chief whip Gandra Venkataramana Reddy has clarified on central minister Ghulam Nabi Azad comments on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X