హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబ్లీని తొలగించాల్సిందే, 13 ప్రాజెక్ట్స్ పైనా: అఖిలపక్షం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Babli Project
హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో తొలగింప చేయాల్సిందేనని అఖిలపక్షం నేతలు సోమవారం నిర్ణయించారు. బాబ్లీ వివాదంపై సచివాలయంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ఛాంబరులో అఖిలపక్షం నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అనీల్, టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మండవ వెంకటేశ్వర రావు, ఎల్ రమణ, టిఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, విద్యాసాగర రావు, సిపిఐ నుంచి చాడ వెంకట రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా అఖిలపక్షం బాబ్లీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగింప చేయాల్సిందేననే నిర్ణయానికి వచ్చింది. బాబ్లీ ప్రాజెక్టు అలాగే ఉంటే తెలంగాణలోని పలు జిల్లాలు ఎడారిగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాబ్లీని తొలగింప చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలని అందరూ నిర్ణయించారు. బాబ్లీను తొలగించడం మినహా ప్రత్యామ్నాయాలు అంగీకరించకూడదని నిర్ణయించుకున్నారు.

బాబ్లీతో పాటు మరో 13 మినీ ప్రాజెక్టుల పైన కూడా దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని ఏకగ్రీవంగా నిర్ణయించారు. కాగా మంగళవారం సుప్రీం కోర్టులో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తుది వాదనలు వినిపించాల్సి ఉంది. రాష్ట్రంలో 18 లక్షళ ఎకరాలకు సాగు నీరందని దుస్థితి బాబ్లీ సహా ఇతర 13 ప్రాజెక్టుల వల్ల నెలకొందన్న విషయాన్ని కోర్టుకు బలంగా వినిపించాలని సర్కారు కూడా యోచిస్తోంది.

English summary
Minister Sudarshan Reddy has arranged all party meeting about Babli issue. Errabelli Dayakar Rao, Vinod Kumar, L Ramana, Vidyasagar Rao, Chada Venkata Reddy were attended to meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X