వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్ల చేతిలో గాయపడ్డ మలాలా కోసం మడోన్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madonna-Malala Yousufzai
న్యూయార్క్: పాకిస్తాన్‌లో తాలిబన్ల కాల్పులకు గురైన పద్నాలుగు ఏళ్ల మలాలా యూసఫ్ జాయ్‌కు పాప్ స్టార్ మడోన్నా మద్దతు పలికారు. తాలిబన్ల దుశ్చర్యను ఖండిస్తూ.. మడోన్నా ఓ పాటను మలాలాకు డెడికేట్ చేశారు. పాప్ స్టార్ మడోన్నా వయస్సు 53. పద్నాలుగేళ్ల వయస్సు గల పాకిస్తాన్ అమ్మాయిని తాలిబన్లు కాల్చారని, ఇది ఎంత దుర్మార్గమైన చర్యనో చూశారా అంటూ మడోన్నా స్టేజ్ పైనుండి ఆడియన్స్‌ను ఉద్దేశిస్తూ అన్నారు.

ఆ తర్వాత ఆమె డ్యాన్స్ చేస్తూ ఇది మలాలా కోసం అంటూ చెప్పింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాడిన మడోన్నా తమ గీతాన్ని మలాలాకు డెడికేట్ చేస్తున్నానని చెప్పారు. మరోవైపు మలాలాకు అత్యుత్తమ చికిత్స అందించడం కోసం ఆమెను బ్రిటన్‌కు తరలించారు. మలాలా కోలుకోవాలని పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.

కాగా గత బుధవారం పాకిస్తాన్‌లో తాలిబన్లు ఘాతుకానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. పద్నాలుగేళ్ల చిన్నారిపై హత్యాయత్నం చేశారు. తమకు వ్యతిరేకంగా గళం విన్పించిందనే ఆగ్రహంతో ఓ బాలిక కార్యకర్తపై కిరాతంగా కాల్పులు జరిపారు. తమ దుశ్చర్యలను దనుమాడిందనే దుగ్దతో ఆ చిన్నారిపై హత్యాయత్నం చేశారు. బాలికా విద్యపై ఇస్లాం తీవ్రవాదుల వైఖరిని వ్యతిరేకించి చిన్నవయసులోనే అత్యంత ధీశాలిగా పాకిస్థాన్‌లో ఖ్యాతికెక్కిన మాలాల యూసఫ్‌ జాయ్‌ను అంతం చేసేందుకు ప్రయత్నించారు.

బడి నుంచి పాఠశాల బస్సులో ఇంటికి వెళుతున్న మాలాలపై కర్కశ దుండగుడొకడు తుపాకీతో రెండుసార్లు కాల్చాడు. స్వాత్ వ్యాలీలోని మింగోర ప్రాంతంలో ఈ దురాగతానికి ఒడిగట్టాడు. దుండగుడి కాల్పుల్లో తలకు, మెడకు గాయాలయిన ఆమెకు అత్యవసర చికిత్స చేసిన తర్వాత సైనిక హెలికాప్టర్‌లో పెషావర్‌కు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అనంతరం మలాలాను బ్రిటన్ తరలించారు.

English summary
Pop singer Madonna during a concert in Los Angeles dedicated a song to 14-year-old Pakistani child activist Malala Yousufzai, who was attacked by the Taliban on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X