హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిపి ఆచార్యకు షరతులతో కూడిన బెయిల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో నిందితుడు, మాజీ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యకు మంగళవారం బెయిల్ లభించింది. నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రూ.లక్షతో పాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, ప్రతి శుక్రవారం సిబిఐ ఎదుట హాజరు కావాలని, పాసుపోర్టును కోర్టులో సరెండర్ చేయాలని తదితర షరతులతో బెయిల్ ఇచ్చింది.

ఎమ్మార్ కేసులో నిందితుడైన బిపి ఆచార్య ఈ సంవత్సరం జనవరి 30వ తేదిన అరెస్టయ్యారు. ఆ తర్వాత సిబిఐ ప్రత్యేక కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సిబిఐ హైకోర్టులో సవాల్ చేసింది. అక్కడ బిపి ఆచార్యకు చుక్కెదురయింది. దీంతో అప్పటి నుండి అతను జైలులోనే ఉన్నారు. రెండుమూడు సార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ సిబిఐ కేసు దర్యాఫ్తులో ఉందని చెబుతూ బెయిల్‌కు నిరాకరిస్తూ వచ్చింది. దీంతో కోర్టులో పలుమార్లు అతనికి చుక్కెదురయింది.

ఎమ్మార్ కేసులో ఇతను భారీ అవకతవకలకు పాల్పడ్డారనేది సిబిఐ ఆరోపణ. అక్రమాలు తెలిసి కూడా సంబంధిత అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేయలేదని, ఎమ్మార్‌కు లబ్ధి చేకూర్చేందుకు ఎపిఐఐసి వాటాలు తగ్గడంలో ఆచార్యనే ప్రధాన కుట్రదారు అని సిబిఐ ఆరోపణ. ఈ రోజు కూడా బిపి ఆచార్య బెయిల్ పిటిషన్‌ను సిబిఐ తిరస్కరించింది. అయితే ఆచార్య తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించి అతనికి బెయిల్ మంజూరు చేసింది.

English summary
The CBI special Court on Tuesday granted bail to suspended IAS officer BP Acharya who was arrested by the CBI in connection with the EMAAR scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X