హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీవవైవిధ్యం అవసరం: జయంతి, టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayanthi Natrajan
హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రపంచంలోనే ప్రముఖ ఆర్థికవేత్త అని కేంద్రమంత్రి జయంతి నటరాజన్ మంగళవారం జీవవైవిద్య సదస్సులో అన్నారు. ఆయన ఆర్థికవేత్త కంటే పర్యావరణ పరిరక్షకుడు అన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం చర్యలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారీగా నిధులు అవసరమని, నిధుల మళ్లింపునకు ప్రపంచ దేశాలు అంగీకరించాలని విజ్ఞప్తి చేశారు.

జీవ వైవిద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు మనలను క్షమించదన్నారు. రాబోయే మూడు రోజుల్లో జీవ వైవిధ్య సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. భవిష్యత్ అవసరాల కోసం పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వ్యవసాయం పైనే ఆధారపడి ఉందన్నారు. జీవ వైవిధ్యం చాలా ప్రధానమైందన్నారు. రాష్ట్రంలో జీవ వైవిధ్య పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జీవ వైవిధ్యం - అభివృద్ధి మధ్య సమతౌల్యం ఉండాలన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు.

అంతకుముందు 2.30 గంటలకు ప్రధానమంత్రి మన్మోహన్ బేగంపేట విమానాశ్రయంలో దిగారు. 2.40 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుండి బయటకు వచ్చారు. అక్కడి నుండి హెచ్ఐఐసికి బయలుదేరారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు. మన్మోహన్ హెలికాప్టర్‌లో బయలుదేరి సదస్సుకు వెళ్లారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు.

English summary
Jayanthi Natarajan has praised Prime Minister Manmohan Singh in biodiversity convention on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X