వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో తెలంగాణ ఒక్కటే సమస్యనా? చాలా: వాయలార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vayalar Ravi
న్యూఢిల్లీ: దేశంలో తెలంగాణ ఒక్కటే సమస్య కాదని ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వాయలార్ రవి మంగళవారం అన్నారు. ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై చర్చల ప్రక్రియ ఆగిపోలేదన్నారు. అందరితోనూ తెలంగాణ విషయమై చర్చిస్తున్నామని చెప్పారు. అయితే చర్చలు ఎప్పటిలోగా ముగుస్తాయో ఖచ్చితంగా చెప్పలేమన్నారు.

కాలపరిమితి చెప్పలేమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కూడా తాము చర్చలు జరుపుతున్నామని తెలిపారు. కేంద్రం, కాంగ్రెసు పార్టీ కూడా సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని చూస్తోందన్నారు. అందుకోసమే చర్చల ప్రక్రియను కొనసాగిస్తున్నామని చెప్పారు.

నాలుగు రోజుల క్రితం కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలని ఆయన అన్నారు. దీనిపై తెలంగాణవాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని తెలిసి కూడా గులాం నబీ ఆజాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కె కేశవ రావు అన్నారు. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసిందన్నారు.

ఆ సమయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు తెలంగాణకు ఒప్పుకున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమే ఆజాద్ వ్యాఖ్యల ఉద్దేశ్యమా అని ఆయన ప్రశ్నించారు. 2009 ఫిబ్రవరిలో కూడా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ అనుకూల ప్రకటన చేశారన్నారు. తెలంగాణను తేల్చాల్సింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. కేంద్రం త్వరలో తెలంగాణ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దని హితవు పలికారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 700 బలిదానాలు జరిగాయని తెలిసిన తర్వాత కూడా ఇలా మాట్లాడటమేమిటన్నారు.

English summary
Central Minister Vayalar Ravi said not only Telangana issue in country. He said many issues are there along with Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X