వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీని పిఎం అభ్యర్థిగా ప్రకటించండి: రామ్ జెత్మలానీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ram Jethmalani
న్యూఢిల్లీ: వచ్చే సాధారణ ఎన్నికలలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ప్రముఖ న్యాయవాది రామ్ జెత్మలానీ సూచించారు. ఆయన బుధవారం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. మోడిని ప్రధాని అభ్యర్థిగా ఇప్పుడే ప్రకటించాలని అందులో సూచించారు. ముందుగానే ప్రకటిస్తే ఓటర్లను కన్విన్స్ చేసేందుకు వీలుగా ఉంటుందని చెప్పారు.

మోడీని ప్రకటించడం కష్ట సాధ్యమైన పనేమీ కాదన్నారు. మోడీ పాలనా దక్షత, సమైక్యతా భావంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ గనక గడ్కరీ అక్రమాలపై సాక్ష్యాలిస్తే తాను సైతం ఆయన తరఫున నిలబడతానని, పైగా తన వద్ద కూడా గడ్కరీ అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలున్నాయని రామ్ జెత్మలానీ తెలిపారు. ఆరోపణలు రుజువైతే గడ్కరీ రాజీనామాకు కూడా తాను డిమాండ్ చేస్తానన్నారు.

రాబోయే రెండేళ్లలో బీజేపీ ఎన్నికల ప్రచారం మొత్తం ప్రభుత్వ అవినీతిపైనే ఉండాలని.. ఇదే సమయంలో మన గూట్లో కంకాళాలను పెట్టుకోవడం (సొంత పార్టీ నేతల అవినీతి)పైనా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. అయితే, జెత్మలానీ రాశారని చెబుతున్న లేఖ ఏదీ తనకు రాలేదని నితిన్ గడ్కరీ చెబుతున్నారు. గతంలో చేసిన తప్పులన్నింటినీ మరిచి, మైనారిటీలకు తగిన అవకాశాలు, భద్రత కల్పించాలని జెత్మలానీ తన లేఖలో పేర్కొన్నారు.

కాగా ఇప్పటికే నరేంద్ర మోడీకి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి మద్దతు పలికిన విషయం తెలిసిందే. మోడీలో లౌకిక వాద లక్షణాలు ఉన్నాయని, హిందుత్వం అంటేనే లౌకికవాదమని రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. తాజాగా జెత్మలానీ కూడా మోడీకి మద్దతుగా నిలిచారు.

English summary
Stirring the hornest's nest in BJP, Ram Jethmalani has strongly pitched for projecting Gujarat CM Narendra Modi as its PM candidate in the next Lok Sabha elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X