వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ: ప్రణబ్‌తో షిండే భేటీ, రేణుకా వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Sushil Kumar Shinde-Renuka Chowdary
న్యూఢిల్లీ: తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న సూచనలు కనిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమై తెలంగాణపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రణబ్ ముఖర్జీతో భేటీపై మీడియాతో మాట్లాడేందుకు షిండే నిరాకరించారు. తెలంగాణపై నిర్ణయం ఏదైనా ఉందా అని అడిగితే నో నో అంటూ తన కార్యాలయంలోకి వెళ్లిపోయారు. అఖిల పక్ష భేటీ ఏమైనా ఉందా అని అడిగితే ఏమీ లేదంటూ చెప్పారు.

అయితే, తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు కదులుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రపతితో షిండే భేటీ జరిగిందని చెబుతున్నారు. గురువారం జరిగిన కాంగ్రెసు పార్టీ సమావేశానికి షిండే హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడినట్లు కూడా సమాచారం.

తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెసు అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని కలిశారు. కిరణ్ కుమార్ రెడ్డితో ఆ ఇరువురు నాయకులు కూడా తెలంగాణపై మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణపై ఇప్పటికే సోనియా గాంధీ రాష్ట్రపతితో మాట్లాడినట్లు చెబుతున్నారు.

మంగళవారంనాడు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుకు హాజరు కావడానికి వచ్చిన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తెలంగాణ సెగ ఏదో మేరకు తగిలింది. తెలంగాణ ఉద్యమకారులనే కాకుండా పలువురు శాసనసభ్యులు పోలీసులు ప్రధాని పర్యటన సందర్బంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటనకు తెలంగాణ మీడియా సంస్థల ప్రతినిధులను అనుమతించలేదు.

అయితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి వాదన మరో విధంగా ఉంది. జరిగే భేటీలన్నీా తెలంగాణ కోసమేనని అనుకోవడం సరి కాదని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం రావాలని తాను కూడా కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

English summary
Under fire on the corruption front, the government seems to be fast-tracking a decision on the contentious Telangana issue. Home Minister Sushil Kumar Shinde is expected to meet President Pranab Mukherjee to discuss the issue. The meeting comes on the heels of Congress war room meeting which Shinde attended on Thursday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X