వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో హైజాక్ హైడ్రామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hijack scare at Thiruvananthapuram airport
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం కాసేపు హైజాక్ హైడ్రామా కొనసాగింది. ఈ రోజు ఉదయం టెక్నికల్ సమస్య కారణంగా కొచ్చి నుండి అబుదబి వెళుతున్న ఓ విమానం తిరువనంతపురంలో నిలిచిపోయింది. విమానం మూడు గంటలకు పైగా నిలిచిపోయింది.

దీంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ఇద్దరు పైలెట్ కాక్‌పిట్‌లోకి ప్రవేశించారు. కంగారుపడిన పైలట్ హైజాక్ అని భావించాడు. వెంటనే హైజాక్ జరిగిందనే సమాచారాన్ని విమానాశ్రయ సిబ్బంది ఇచ్చాడు. పైలట్ హెచ్చరికలతో విమానాశ్రయ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

విమానం హైజాక్ అయిందని, దిగాలని అధికారులు ప్రకటించారు. అయితే ప్రయాణీకలు మాత్రం విమానం దిగేందుకు ససేమీరా అన్నారు. అధికారులు బలగాలను అప్రమత్తం చేశారు. సిఐఎస్ఎఫ్ బలగాలు అక్కడకు చేరుకున్నాయి. అయితే విమానం ఎలాంటి హైజాక్‌కు గురి కాలేదని ఆ తర్వాత తెలిసింది.

కాక్‌పిట్‌లో ఎవరో చొచ్చుకొచ్చే ప్రయత్నాలు చేయడంతో పైలట్ కంగారుపడి హైజాక్ అలారం మోగించాడని తెలుసుకున్నారు. పైలట్ పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రయాణీకులు మాత్రం తాము ఎవరం కాక్‌పిట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. ఈ విమానంలో 200 మంది ప్రయాణీకులు ఉన్నారు.

English summary
There was scare and high drama at the Thiruvananthapuram airport when the pilot of an Air India express Abudhabi-Kochi flight raised a hijack alarm after an angry passenger tried to barge inside the cockpit for delay in departur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X