హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌కు చుట్టుకుంటుంది: రాంబాబు ఫిల్మ్‌పై జగ్గారెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jagga Reddy
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వివాదం విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీరుపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సినిమా దర్సకుడు పూరీ జగన్నాథ్, పంపిణీదారు దిల్ రాజు కార్యాలయాలపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. తెరాస మిలిటెంట్ పార్టీలా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

దాడులు చేస్తే సినీ పరిశ్రమ హైదరాబాదు నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని, అలా తరలిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. హైదరాబాదులో ఉన్నవాళ్లంతా బయటకు పోవాలనేది తెలంగాణ ఉద్యమమా అని ఆయన అడిగారు. తెలంగాణలో హింసకు తెరాస కారణమని ఆరోపించారు. హింసను ఆపకపోతే అది ఏదో ఒక రోజు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు చుట్టుకుందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. సినిమాపై అభ్యంతరాలుంటే సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయాలి గానీ దాడులు చేయడం సరి కాదని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమం తెరాస చేతుల్లో లేదని చెప్పారు. తెలంగాణ ఉద్యమం పదవుల కోసం కాదని, సిఎం పదవో పిసిసి పదవో ఇస్తే తెలంగాణ ఉద్యమం చల్లారదని ఆయన అన్నారు. తెరాసను మేనేజ్ చేస్తే ఉద్యమం ఆగుతుందనేది కూడా భ్రమేనని ఆయన అన్నారు.

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం సరి కాదని పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. పాదయాత్లు చేస్తే ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని ఆయన అన్నారు. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ సాధ్యమని అన్నారు. తెలంగాణపై తమ పార్టీలోనే ఏకాభిప్రాం లేదని ఆయన అన్నారు.

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను నిషేధించాలని తెరాస నాయకుడు శ్రవణ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో సినిమా ప్రదర్సనను అడ్డుకుంటామని ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు.

English summary
Congress MLA Jagga Reddy condemned the attacks on offices of Cameraman Ganga tho Rambabu movie director Puri Jagannath and distributor Dil raju. He blamed TRS for attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X