హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ మూవీపై ఆగని రగడ: ప్రభుత్వానికి కమిటీ నివేదిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Cameraman Ganga Tho Rambabu
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాపై దుమారం ఆగడం లేదు. వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సమాచార శాఖ కమిషనర్ చంద్రదన్ నేతృత్వంలో వేసిన కమిటీ సభ్యుల్లో ముగ్గురు మాత్రమే శనివారం సినిమా చూశారు. చంద్రవదన్ సినిమా నైజాం పంపిణీదారుడు దిల్ రాజుతో కలిసి సినిమా చూశారు. తాము ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ సభ్యులు తెలిపారు.

సినిమాను ముగ్గురు సభ్యులు మాత్రమే చూశారని, మిగిలిన నలుగురు చూడాలని సభ్యుల్లో ఒకరైన అల్లాణి శ్రీధర్ అన్నారు. సినిమాలో కొందరి మనోభావాలను దెబ్బ తీసేలా అభ్యంతరకరమైన సంభాషణలు ఉన్నాయని, వాటిని తొలగించాలని సూచిస్తామని ఆయన అన్నారు. కొందరి మనోభావాలను దెబ్బ తీసేలా కొన్ని సన్నివేశాలున్నాయని, వాటిని తొలగింపజేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని తెలంగాణ ఫిల్మ్ ఛేంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి అన్నారు.

మిగతా సభ్యుల అభిప్రాయాలను కూడా తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చంద్రవదన్ చెప్పారు. దర్శకుడికి, నిర్మాతకు - ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత ఉంటుందని అల్లాణి శ్రీధర్ అన్నారు. కాగా, కమిటీని బహిష్కరిస్తున్నట్లు దర్శకుడు ఎన్ శంకర్, నమస్తే తెలంగాణ సంపాదకుడు అల్లం నారాయణ చెప్పారు. ఆ సినిమాను తాను చూడదలుచుకోలేదని, కమిటీ సమావేశంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని అల్లం నారాయణ చెప్పారు.

కాగా, ఎన్ శంకర్ తాజా ఆరోపణలతో కొత్త వివాదానికి తెర తీశారు. పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాగా, తెలంగాణలో సినిమాకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలకు కౌంటర్‌గా ఆంధ్ర ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళనలకు దిగారు. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు రాస్తారోకోలు నిర్వహించారు. సినిమాను అడ్డుకోవడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.

సినిమా రాజకీయ రంగు కూడా పులుముకుంది. సీమాంధ్రకు చెందిన రాజకీయ నాయకులు సినిమాను బలపరుస్తుండగా, తెలంగాణ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. సినిమా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉందంటూ తొలి రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు తగులపెట్టారు. తెలంగాణవాదులు సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన తర్వాత వారు మాట్లాడడం లేదు. మొత్తం మీద, సినిమా పెద్ద దుమారాన్నే రేపింది.

English summary
The row on Pawan Kalyan's Cameraman Ganga tho is continuing in Andhra Pradesh. The government constituted committee will present a report on the film shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X