వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేధింపులతో విద్యార్థి సూసైడ్: రైలు ఢీకొని ఇద్దరు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Degree student commits suicide
నల్గొండ/వరంగల్: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఓ డిగ్రీ విద్యార్థిని యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. సంతోష్ నగర్‌లో ఉంటున్న హారిక అనే అమ్మాయి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెను గతకొంతకాలంగా కొంతమంది ఆకతాయిలు వేధిస్తున్నారు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె నెల రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

అప్పటి నుండి ఆకతాయిలు తమ వేధింపులను ఎక్కువ చేశారు. దాంతో మనస్తాపం చెందిన హారిక ఆత్మహత్య చేసుకుంది. వారి వేధింపుల వల్లనే తాను ఆత్మహత్య చేసుకున్నానని తన సూసైడ్ లేఖలో పేర్కొంది. అమ్మాయి తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అమ్మాయిని ఫోన్లోనూ బెదిరించేవారని వారు చెబుతున్నారు. ఈమెను వేధించిన ఆకతాయిపై ఇతర కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

రైలు ఢీకొని తల్లీ కూతుళ్లు మృతి

వరంగల్ జిల్లాలో రైలు ఢీకొని తల్లీ కూతురు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. కూతురు అనిత మెడలోని బంగారు గొలుసును ఓ దొంగ ఎత్తుకు పోయాడు. దాని గురించి తల్లి ప్రమీల, కూతురు అనిత పట్టాలపై వెతుకుతుండగా గూడ్స్ రైలు వారిని ఢీకొంది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

English summary
Degree student Harika committed suicide on Saturday night in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X