వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పవన్ సినిమాకు భద్రత, భయపడొద్దు': దిష్టిబొమ్మదగ్ధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్: పవన్ కల్యాణ్ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఏడు కట్టింగ్స్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమాలో వివాదాస్పద కట్టింగ్స్ తీసినందు వల్ల తెలంగాణ ప్రాంతంలోని థియేటర్లకు భద్రత కల్పించామని, యజమానులు భయపడవద్దని రాష్ట్ర డిజిపి దినేష్ రెడ్డి శనివారం సూచించారు.

దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంటిపై దాడిచేసిన వారిని అరెస్టు చేశామని తెలిపారు. నిర్మాత దిల్‌ రాజు ఇంటిపై దాడి చేసిన వారిని సైతం త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. కాగా పూరీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో శనివారం హాజరు పరిచారు. అదుపులోకి తీసుకున్న 15మందికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

ఆ వెంటనే మూడు వేల రూపాయల బాండ్, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో నిందితులకు షరతులతో కూడినబెయిల్ మంజూరైంది. మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ చిత్రానికి క్లీన్ చిట్ ఇచ్చారు. చిత్రంలో ఎక్కడా ఎవరి మనోభావాలు దెబ్బతినేవిధంగా సన్నివేశాలు, డైలాగులు లేవని చెప్పారు.

పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల పవన్ కల్యాణ్ , చిరంజీవి అభిమానులు సినిమాల పైనా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వురు, గుంటూరులో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పిఠాపురంలో పవన్ అభిమాన సంఘం నేతలు.. పలువురి ఫొటోలను చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు.

English summary

 DGP Dinesh Reddy has promised to Theatres managment on security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X