వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓవరాక్షనే: పవన్ సినిమాపై నారాయణ, షర్మిలది పోటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం కెమెరామెన్ గంగతో రాంబాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పైన స్పందించారు. పవర్ స్టార్ పవన కల్యాణ్ హీరోగా వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా విషయంలో దాడులు సరికాదని నారాయణ అన్నారు. సినిమాను సినిమాలాగే చూడాలని సూచించారు.

ఒకవేళ ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్ బోర్డును సంప్రదించాలని, అంతేకాని దాడులు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా వివాదం విషయంలో ఇరుపక్షాలది ఓవర్ యాక్షన్‌గానే కనిపించిందని చెప్పారు. షర్మిల పాదయాత్ర రాజకీయ యాత్ర కాదని ఆమెది పోటీ యాత్ర అని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్రకు పోటీగానే షర్మిల రంగంలోకి దిగారన్నారు. చంద్రబాబు పాదయాత్రను తాము తెలంగాణలో అడ్డుకోమని చెప్పారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నిరసనలకు పిలుపునిచ్చినప్పటికీ తాము దానికి దూరంగానే ఉంటామని నారాయణ చెప్పారు.

సెన్సార్ బోర్డును రద్దు చేయాలి

తెలంగాణ ఉద్యమాలను కించపరిచే సినిమాలను నియంత్రించడంలో విఫలమైన సెన్సార్ బోర్డును వెంటనే రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే తెలంగాణలో పాదయాత్ర చేయాలన్నారు. తెలంగాణపై కేంద్రం నాన్చుడు ధోరణిని అవలంభిస్తోందని మండిపడ్డారు.

దాడి సరికాదు

కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో తమకు వ్యతిరేకంగా ఉందనుకుంటే చూడవద్దని చెప్పాలి కానీ ఇలా దాడులు చేయడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. భావ ప్రకటనపై దాడి సరికాదన్నారు.

English summary
CPI state secretory Narayana has responded on Power Star Pawan Kalyan latest movies Camaraman Gangatho Rambababu contoversy issue and Sharmila padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X